
వంత పాడిన సొంత మీడియా...
2004-కృష్ణా పుష్కరాల సమయంలో రెయిలింగ్ కూలి ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటనపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. ఇక చంద్రబాబు.. కాంగ్రెస్ నిర్వాకం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు.
చేతగాకుంటే దిగిపొమ్మంటూ హూంకరించారు. బాబు ప్రకటనలన్నింటినీ పతాక శీర్షికలకెక్కించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రం 29 మంది మరణించిన దుర్ఘటనను మాత్రం లైట్‌గా తీసుకుంటున్నాయి.