ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు కోసం జరుగుతున్న కుట్ర సర్వే గురించి ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. సర్వేల పేరుతో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాను ట్యాబుల్లో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు.