సాక్షి, విజయనగరం: జిల్లాలో మరోసారి సర్వేల కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం గజపతినగరంలో సర్వే చేస్తున్న 15 మంది సభ్యులను వైఎస్సార్ సీసీ నేతలు పట్టుకున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఇళ్లకు మాత్రమే వెళ్లి సర్వే చేయడంతో అనుమానం వచ్చి.. ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారివద్ద నుంచి మూడు ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు రామభద్రపురం మండలంలోని నర్సాపురంలో సర్వే చేస్తున్న కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని వైఎస్సార్ సీపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కిరణ్‌కుమార్ వద్ద నుంచి పోలీసులు ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓట్లు తొలగింపుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల సర్వే చేస్తున్న వ్యక్తులు తాము ప్రభుత్వం తరఫున వచ్చామని చెప్పడం, ప్రభుత్వ పథకాల పనితీరుపై ప్రశ్నలు సంధించడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. దొంగ సర్వే పేరిట ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీ పోలీసులను ఆశ్రయిస్తే.. సర్వేలను అడ్డుకుంటున్నారనే నెపంతో ఆ పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం సర్వే వెనుక కుట్ర ఉందనే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటమి భయంతోనే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి దొంగచాటు చర్యలు చేపట్టారనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఈ ఓటర్ల ఓటర్ల వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసీ అధికారులను, డీజీపీని కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment