సాక్షి, అమరావతి : సర్వే పేరుతో ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో టీడీపీ వ్యతిరేక ఓట్ల తొలగింపునకు కట్ర జరుగుతోంది. సెంటర్ ఫర్ సోషియో పొలిటికల్ అనాలసిస్(ఎస్‌పీఏ) అనే బెంగళూరుకు చెందిన సంస్థ పేరుతో సీఎం చంద్రబాబు నాయడు ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే చేస్తున్న సభ్యుల ఎంపిక మొదలు.. వారికి ఇచ్చే ట్యాబ్‌లు సైతం ప్రభుత్వ పెద్దల నుంచే సరఫరా చేసినట్లు సమాచారం. గత పుష్కరాల్లో ఉపయోగించిన ట్యాబ్‌లతోనే సర్వేలు చేస్తుండటంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. 10 మంది సర్వే సభ్యులను ఓ టీడీపీ యూత్ లీడర్ పర్యవేక్షిస్తున్నారు. సర్వే చేస్తున్నవారికి రోజుకు రూ.వెయ్యితో పాటు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక ఈ ట్యాబ్‌లన్నింటినీ అమరావతి మానిటరింగ్ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ ట్యాబ్‌ల ద్వారా సమాచారం అందిన వెంటనే వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సర్వే చేస్తున్న టీమ్‌ను స్వయంగా నారా లోకేష్ పర్యవేక్తిస్తున్నట్లు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
విజయనగరం జిల్లాలో కొంతమంది యువకులు సర్వే పేరిట ప్రభుత్వ వ్యతిరేకుల వివరాలు నమోదు చేసుకోవడం కలకలం రేపింది. దీనిని గుర్తించిన వైఎస్సార్‌సీపీ నాయకులు సదరు యువకులను పోలీసులకు అప్పగించారు. ట్యాబ్స్‌లో ఓటర్ల లిస్ట్ పెట్టుకుని సర్వేలు చేయటం విరుద్దమని, ఇలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పనితీరు, పథకాల మీద అభిప్రాయం కోరుతూ వస్తున్న ఫోన్ల ఆధారంగా ఈ సర్వేలు సాగుతున్నట్లు విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన ట్యాబ్స్‌లో నమోదు చేసుకోవడంతో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలకు అనుమానం వచ్చింది. దాంతో వారిపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు సిద్దమవుతుండటంతో పోలీసులు ముందస్తు అరెస్టులుకు దిగారు. జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని జామి పోలీసు స్టేషన్ కు తరలించారు. నాయకుల అరెస్ట్‌తో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment