మళ్లీ అడ్డంగా బుక్కైన తోక చానల్‌ | Another Fake Survey Released By Yellow Media  | Sakshi
Sakshi News home page

మళ్లీ అడ్డంగా బుక్కైన తోక చానల్‌

Published Sun, Apr 7 2019 8:57 PM | Last Updated on Sun, Apr 7 2019 9:25 PM

Another Fake Survey Released By Yellow Media  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నేషనల్‌ మీడియా సర్వేలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదే అధికారమని స్పష్టం చేయడంతో.. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన ఎల్లో మీడియా ఫేక్‌ సర్వే కుట్రకు తెరలేపారు. లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సర్వే పేరిట ఇటీవల ఆంధ్రజ్యోతి పన్నిన ఎన్నికల సర్వే కుతంత్రం బెడిసికొట్టిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు పన్నిన పన్నాగం అభాసుపాలైంది. టీడీపీ ఏకంగా 126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవనుందని ప్రముఖ సంస్థ లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సర్వేలో వెల్లడైనట్లు ప్రచురించింది. అయితే సదరు సంస్థ తాము ఏ సర్వే చేయలేదని, తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చంద్రబాబు ఆయన ఎల్లోమీడియా బాగోతం బట్టబయలైంది. అంతటితో ఆగకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయసాయిరెడ్డి వాయిస్‌ అంటూ ఓ ఫేక్‌ ఆడియో కాల్‌ను తీసుకొచ్చి మరోసారి అబాసు పాలైంది. ఆ ఆడియో విన్న ఎవరైనా అది విజయసాయిరెడ్డి వాయిస్‌ కాదని ఇట్టే పట్టేస్తారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఖబర్దార్‌ రాధాకృష్ణ అంటూ మీడియా ముఖంగా విజయసాయిరెడ్డి హెచ్చరించడంతో ఆ ఆడియోను మాయం చేసింది. పత్రికలో మాత్రం అది విజయసాయిరెడ్డిదేనని బుకాయించే ప్రయత్నం చేసింది.

తాజాగా కార్పొరేట్‌ చాణక్య అనే పేరుతో మరో ఫేక్‌ సర్వేను జనాలపై రుద్దే ప్రయత్నం చేసింది. ఈ సర్వేలో టీడీపీకే ప్రజలు పట్టం కట్టారని.. చంద్రబాబు చేసిన అభివృద్ధికి ప్రజలు బాగున్నాయంటున్నారని అహో..ఓహో అని ఊదరగొట్టింది. టీడీపీ ఏకంగా 101 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని, ప్రతిపక్షపార్టీ అయిన వైఎస్సార్‌సీపీ 71 సీట్లు.. జనసేన మూడు సీట్లు గెలుస్తుందని పేర్కొంది. అయితే వారు పేర్కొన్న కార్పొరేట్‌ చాణక్య సంస్థ గురించి ఇంటర్నెట్‌లో ఆరా తీయగా.. ఎక్కడా ఎలాంటి వివరాలు లభించలేదు. అసలు సంస్థ ఉన్నట్టు ఎక్కడా కనబడలేదు. 13 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాల్లో సర్వే నిర్వహించిన సంస్థకు ఒక వెబ్‌సైట్‌, సోషల్‌ మీడియా అకౌంట్స్‌ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టుడే చాణక్య అనే ప్రముఖ సర్వే సంస్థ పేరుకు దగ్గరగా ఉండేలా ‘కార్పొరేట్‌ చాణక్య’ అనే సర్వే కంపెనీని సృష్టించి.. ప్రజల్లో గందరగోళం లేపే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ కుట్రను ముందుగానే గుర్తించి వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ప్రజలను, ప్రార్టీశ్రేణులను అప్రమత్తం చేశారు.

‘తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని లగడపాటితో చెప్పించాలా? ఇంకో రూపంలో వెల్లడించాలా? అని మల్లగుల్లాలు పడుతున్నారట చంద్రబాబు. లగడపాటి+ ఏదైనా చానల్ చేసిన సర్వే అని చెప్పిస్తే జనాలను నమ్మించవచ్చని పచ్చమీడియా సలహా ఇచ్చిందిట. స్కెచ్ ఎలా ఉంటుందో చూడాలి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. సరిగ్గా 4 గంటల అనంతరం ఆంధ్రజ్యోతి ఈ ఫేక్‌ సర్వే వివరాలను టీవీ, వెబ్‌సైట్‌లో వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటితో పన్నిన వ్యూహం బెడిసి కొట్టడంతో ఇప్పుడు ఆయనను కాకుండా కార్పొరేట్‌ చాణక్య పేరుతో ఈ ఫేక్‌ సర్వే కథనాన్ని వండి వార్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement