ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : 2014 ఎన్నికల్లో బీజేపీ సష్టించిన ప్రభంజనం 2019 ఎన్నికల్లో పునరావతం అవడమే కాకుండా, అంతకంటే ఎక్కువ ప్రభంజనాన్ని సష్టిస్తుందట. లోక్‌సభలోని 543 సీట్లకుగాను హీన పక్షంలో బీజేపీకి 323 సీట్లు, గరిష్టంగా 380 సీట్లు వస్తాయని అమెరికాలోని గూఢచారి సంస్థ సీఐఏ, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో తేలినట్లు ‘బీబీసీ న్యూస్’ హోం పేజీ ట్యాగ్‌ను తగిలించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలోనే కాకుండా ట్విట్టర్‌లో కూడా షేర్ చేసుకున్నారు. కొన్నింటిలో సీఐఏ, ఐఎస్‌ఐ నిర్వహించిన సర్వే తేలిందని ఉండగా, బీబీసీ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో తేలిందని మరికొన్నిట్లో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని సీట్లు బీజేపీకి వస్తాయని, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయో కూడా వైరల్ అయిన వార్తలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 25 సీట్లకుగాను మూడు నుంచి నాలుగు, అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు సీట్లకు రెండు, అస్సాంలో 14 సీట్లకుగాను 8–10 సీట్లు, బీహార్‌లో 40 సీట్లకుగాను 30–35 సీట్లు, చత్తీస్‌గఢ్‌లో 11 సీట్లకుగాను ఆరు నుంచి ఎనిమిది, గోవాలో రెండుకు రెండు, గుజరాత్‌లో 26కు 24–25, హర్యానాలో 10కిగాను ఆరు నుంచి ఎనిమిది, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగింటికి నాలుగు, జమ్మూ కశ్మీర్‌లో ఆరింటికి మూడు, జార్ఖండ్‌లో 14కు ఎనిమిది నుంచి పది, కర్ణాటకలో 28కి 24–25, కేరళలో 20 సీట్లకు రెండు నుంచి మూడు, మధ్యప్రదేశ్‌లో 29కి 24–25, మహారాష్ట్రలో 48కి 36–38, ఒడిశాలో 21కి 8–10, పంజాబ్‌లో 13కు, ఐదు నుంచి ఆరు, రాజస్థాన్‌లో 25కు 20–24, తమిళనాడులో 39కి 28–30, తెలంగాణలో 17లో ఒకటి నుంచి రెండు, త్రిపురలో రెండుకు రెండు సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
వాట్సప్‌లో వైరల్ అవుతోన్న మెసేజ్
అలాగే, ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లకుగాను 45 నుంచి 70 సీట్లు, ఉత్తరాఖండ్‌లో ఐదుకు ఐదు, పశ్చిమ బెంగాల్‌లో 42కు పది నుంచి 12, మేఘాలయలో రెండుకు ఒకటి, మిజోరమ్‌లో ఒకటికి ఒకటి, మణిపూర్‌లో రెండుకు ఒకటి, నాగాలండ్‌లో ఒకటికి ఒకటి, ఢిల్లీలో ఏడుకు ఆరు నుంచి ఏడు, అండమాన్, చండీగఢ్, దాద్రి నగర్ హవేలి, డామన్, డయ్యూ, లక్ష్యదీప్, పుదుచ్ఛేరిలలో ఒక సీటుకు ఒక సీటు బీజేపీకి వస్తాయని పేర్కొన్నారు. ఇక దేశంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణగల నాయకుడని కూడా తేలినట్లు ఆ వార్తల్లో ఉంది. వాస్తవానికి ఈ వార్తతోని తమకు ఎలాంటి సంబంధం లేదని, అసలు భారత్‌లో తాము ప్రీపోల్ సర్వేలు ఎన్నడూ నిర్వహించమని బీబీసీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇది పూర్తిగా నకిలీ వార్తంటూ నకిలీ వార్తలను వెతికి పట్టుకునే పోర్టల్ ‘ఆల్ట్ న్యూస్’ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment