సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి క్లీన్‌స్వీప్ దిశగా బీజేపీ దూసుకెళ్లిపోతోంది. ఉత్కంఠ భరింతంగా సాగిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీ సొంతం చేసుకునే దిశగా ఆధిక్యంలో సాగుతోంది. ప్రస్తుతం ఫలితాలను బట్టిచూస్తే మరోసారి గత ఫలితాలను పునరావృత్తం చేస్తుందని స్పష్టంమవుతోంది. కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలను ఢిల్లీ ఓటర్లు ఈసారి కూడా నిరాకరించారు. కనీసం బీజేపీ అభ్యర్థులకు పోటీ కూడా ఇవ్వలేని స్థితిలోని రెండూ పార్టీలు ఢీలాపడ్డాయి. గత ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఈసారి కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు బరిలోకి దిగినప్పటికీ హస్తంపార్టీ రాతమాత్రం మారలేదు. మూడు సార్లు ఢిల్లీ సీఎంగా వ్యవహంచిన పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ భారీ ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఆమెపై సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారి భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. మరో సీనియర్ నేత అజయ్ మాకెన్‌కి కూడా ఓటమి తప్పలేదు. మరికొన్ని చోట్ల ఆప్, కాంగ్రెస్ కనీసం గట్టిపోటీ కూడా ఇవ్వలేకపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment