సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థులపై విమర్శల దాడిని పెంచుతూ రాజకీయ పార్టీలు ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నాయి. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అధికార పక్షంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని ఎక్కుపెడుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ నాజీ నాయకుడు హిట్లర్‌తో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు. హిట్లర్ తరహాలోనే మోదీ కూడా ప్రతిపక్షాలపై, విమర్శకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హిట్లర్ పాలనలో నాజీల సైన్యం అమాయక ప్రజలను హింసించి చంపేవారని, మోదీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు.
మరోసారి అధికారంలోకి రావడానికి నియంత హిట్లర్ పాటించిన విధానాన్నే మోదీ పాటిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. .అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మోదీ, బీజేపీ నేతలకు అర్థం కావడం లేదని శనివారం కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాగా హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ మైనారిటీ కుటుంబంపై హోలీ సందర్భంగా కొంత మంది దాడి చేశారని వస్తున్న వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ విధంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి దాడులు చేయ్యమని ఏ గీత చెబుతుంది? ఏ రామాయణంలో రాసుంది?’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment