ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విమర్శలు, ప్రతివిమర్శలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మహిళా సమ్మాన్ సమారోహ్’ పేరుతో నిర్వహించిన మహిళల సభలో సీఎం కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు.
‘చాలా మంది పురుషులు ప్రధాని మోదీ పేరుతో నినాదాలు చేస్తున్నారు. మహిళలు వారి ఆలోచనలు మార్చాలి. మీ(మహిళలు) భర్తలు మోదీ నినాదాలు చేస్తే.. తమకు భోజనం పెట్టమని చెప్పండి’ అని కేజ్రీవాల్ అన్నారు. మహిళలు తమ కుటుంబ సభ్యులతో చర్చించి.. ఆప్‌కు తమ మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా బీజేపీకి మద్దతుగా ఉన్న మహిళలకు చెప్పండి.. తమ సోదరుడు(కేజ్రీవాల్) మహిళలందరికీ అండగా ఉంటాడని చెప్పాలన్నారు.
‘వారికి (బీజేపీకి మద్దతు పలికే మహిళలు) చెప్పండి మా ప్రభుత్వం విద్యుత్ ఉచితంగా అందజేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఇకనుంచి మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నాం. మహిళకు బీజేపీ ఏం చేసింది. అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? మహిళలంతా ఈసారి కేజ్రీవాల్‌కే ఓటు వేయండి’ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
‘కొన్ని పార్టీలు మహిళలకు కొన్ని పదవలు ఇచ్చి.. మహిళా సాధికారత కల్పిస్తున్నామని చెబుతున్నాయి. నేను అలా చెప్పను. మహిళలకు పదవుల ఆశ చూపటం సరికాదు. వాళ్లకు అన్ని అవకాశాలు ఇవ్వాలి. కేవలం ఇద్దరూ లేదా నలుగురు మహిళలకు లబ్ధి కలిగించిటం సరికాదు. మరీ మిగతా మహిళలు పరిస్థితి ఏంటి?’ అని కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
తమ ప్రభుత్వం అందించనున్న ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చే పథకమే నిజమైన మహిళా సాధికారతకు నిదర్శనం అన్నారు. ఇక.. ఇటీవల కేజ్రీవాల్ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్‌లో మహిళలకు నెలకు వెయ్యి రూపాయాలు అందజేస్తామని కేటాయింపులు ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్
Comments
Please login to add a commentAdd a comment