న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగాన్ని సవాలు చేస్తూ మనోహర్‌లాల్ శర్మ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు.
ఈ నేపథ్యంలో జస్టిస్ రోహింటన్ నారీమన్ ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ..‘ శర్మ అసలు మీరేం కావాలని అడుగుతున్నారు. మొత్తం లోక్‌సభ ఎన్నికలనే రద్దు చేయమంటున్నారా’ అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయంతో ప్రతిపక్షాలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలంటూ డిమాండ్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అనుమానాలు వ్యక్తం చేశారు.
"What are you asking for Mr Sharma? You want us to set aside the entire Lok Sabha elections?" Justice Rohinton Nariman observed and refused to entertain ML Sharma's petition. https://t.co/B8JhjWn8FQ
— ANI (@ANI) July 5, 2019
Comments
Please login to add a commentAdd a comment