rohinton nariman
-
ఆర్టికల్ 370 రద్దు : ‘సుప్రీం కోర్టు తీర్పు కలవరపరించింది’
ముంబై: న్యాయ కోవిదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. ఇటీవల సుప్రీం కోర్టు ఆర్టికల్ 370 రద్దుపై వెలువరించిన తీర్పు, కొలీజియం వ్యవస్థ, ఎలక్షన్ కమిషనర్ల నియామకం బిల్లు వంటి అంశాలపై ఆయన శుక్రవారం ఆసియాటిక్ సోసైటీ ఆధ్వర్యంలో ‘కాన్స్టీట్యూషన్: చెక్ అండ్ బ్యాలన్సస్’ మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు తనని చాలా కలవెరపెట్టిందని తెలిపారు. ఆర్టికల్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించిందని తెలిపారు. అయితే దానివల్ల రాజ్యాంగ విరుద్ధమైన చర్యను కొనసాగించడానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లు ఇటీవల రాజ్య సభలో ఆమోదం పొందిన విషయం కూడా తనను తీవ్ర కలవరానికి గురి చేసిందని చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. జడ్జిలను ఎంపిక చేసే ప్రస్తుత కొలీజియం వ్యవస్థ కూడా దారుణమైనదని కానీ,అది కొంతమేరకు మేలేనని తెలిపారు. రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంను తాను సూచిస్తానని అన్నారు. అందులో ఉండేవారు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. ప్రధాని న్యాయమూర్తి, సీనియర్ న్యాయమూర్తుల సూచనలు కూడా తీసుకుంటారని అన్నారు. అనంతరం వారు న్యాయమూర్తులను సిఫార్సు చేస్తారని చెప్పారు. చదవండి: ఆధార్‌పై ప్రశ్నలకు భారీ స్పందన.. -
తప్పో.. ఒప్పో.. అంగీకరించడం మీ విధి: నారిమన్
ముంబై: న్యాయ కోవిదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్.. తాజాగా చేసిన కామెంట్లు విస్తృత చర్చకు దారి తీశాయి. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారాయన. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర ప్రకటన చేశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ(కొలీజియం సిఫార్సులు) ఆలస్యమైతే.. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినట్లేనని అభిప్రాయపడ్డారు మాజీ న్యాయమూర్తి నారీమన్. కొలీజియం వ్యవస్థ విషయంలో కేంద్రం వర్సెస్ న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వైరుధ్యం తెలిసిందే. ఈ క్రమంలో కిరణ్ రిజిజు.. న్యాయ వ్యవస్థ అసలు పారదర్శకంగా లేదని, న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కూడా పాత పద్ధతిలోనే (NJAC ద్వారా) కొనసాగాలంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే.. ముంబైలో జరిగిన ఓ లా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. నేరుగా కేంద్ర న్యాయమంత్రిపైనే విమర్శలు ఎక్కు పెట్టారు. కోర్టు ఇచ్చే తీర్పులు తప్పో ఒప్పో.. ఏవైనా సరే వాటిని అంగీకరించాల్సి ఉంటుందని, మీ విధులకు మీరు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉందని న్యాయశాఖ మంత్రి రిజిజును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీడియా సాక్షిగా న్యాయవ్యవస్థను లా మినిస్టర్ కిరెన్ రిజిజు ‘న్యాయవ్యవస్థలో పారదర్శకత అవసరం’ అంటూ విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఇప్పుడు మీరు విమర్శించొచ్చు. ఒక పౌరుడిగా నేనూ విమర్శించొచ్చు. ఎలాంటి సమస్య లేదు. కానీ, మీరిప్పుడు ఒక యంత్రాంగం అనే విషయం గుర్తుంచుకోండి. కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చినా కట్టుబడాల్సిందే.. అంగీకరించాల్సిందే’’ అని పేర్కొన్నారాయన. స్వతంత్రంగా, ఏ మాత్రం బెదరక తీర్పులిచ్చే న్యాయమూర్తులు దేశానికి అవసరమని, వాళ్లు గనుక లేకుంటే న్యాయవ్యవస్థ కుప్పకూలిపోతుందని, దేశం కొత్త చీకటి యుగంలోకి నెట్టేయబడుతుందని నారీమన్ అభిప్రాయపడ్డారు. పనిలో పనిగా.. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థకు సైతం ఆయన ఓ సలహా ఇచ్చారు. కొలిజీయం ప్రతిపాదలను నిర్వీర్యం చేసే ఆలోచన ఏమాత్రం మంచిది కాదని, అసలు కొలిజీయం సిఫార్సుల మీద కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం 30 రోజుల గడువు విధించాలని, ఆలోపు స్పందన లేకుండా ఆ సిఫార్సులు వాటంతట అవే ఆమోదించబడాలని సుప్రీం కోర్టుకు సూచించారు. కొలీజియం స్వతంత్రంగా లేకపోతే దాని నిర్ణయాలు ఒకరిద్దరికే అనుకూలంగా వస్తాయన్నారు. కొలీజియం వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోకుండా దాన్ని తొలగించాలని చూడకూడదని చెప్పారు. ఇదిలా ఉంటే మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలి నారీమన్.. ఆగస్టు 2021లో రిటైర్ అయ్యారు. అయితే.. అంతకు ముందు ఆయన కొలీజియం వ్యవస్థలో భాగం పంచుకున్నారు. -
అసలు మీకేం కావాలి : సుప్రీం ఆగ్రహం!
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగాన్ని సవాలు చేస్తూ మనోహర్‌లాల్ శర్మ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జస్టిస్ రోహింటన్ నారీమన్ ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ..‘ శర్మ అసలు మీరేం కావాలని అడుగుతున్నారు. మొత్తం లోక్‌సభ ఎన్నికలనే రద్దు చేయమంటున్నారా’ అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయంతో ప్రతిపక్షాలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలంటూ డిమాండ్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అనుమానాలు వ్యక్తం చేశారు. "What are you asking for Mr Sharma? You want us to set aside the entire Lok Sabha elections?" Justice Rohinton Nariman observed and refused to entertain ML Sharma's petition. https://t.co/B8JhjWn8FQ — ANI (@ANI) July 5, 2019 -
బిల్లు అయ్యాక చేసేదేమీ ఉండదు: నారిమన్
సమైక్య పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 8 పిటిషన్లు దాఖలు కాగా, వాటన్నింటినీ కోర్టు విచారణకు స్వీకరించింది. అన్నింటినీ ఒకేసారి విచారిస్తోంది. కాగా, పిటిషనర్ల తరఫున మోహన్‌లాల్ శర్మ, రోహింగ్టన్ నారిమన్ వాదనలు వినిపస్తున్నారు. రాజ్యాంగంలోని 371(డి), ఇ లను సవరించకుండా విభజన చేయలేరని నారిమన్ అన్నారు. పంజాబ్ విభజన సమయంలో అనేక కమిటీలు పనిచేశాయని, ఇప్పుడు మాత్రం కనీసం శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టలేదుని, బిల్లు చట్టం అయ్యాక చేయడానికి ఇంకేమీ ఉండదని నారిమన్ వాదించారు. తక్షణమే విభజన స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఇక సమైక్య స్ఫూర్తి అనేది ప్రజాస్వామ్యానికి మూలమని మరో న్యాయవాది ఎంఎన్ రావు అన్నారు. అసెంబ్లీ అంగీకారం లేకుండా ఎక్కడా విభజన జరగలేదని, ఒకవేళ బిల్లును అసెంబ్లీ నిరాకరిస్తే రాష్ట్రాన్ని ఏర్పరిచే హక్కు కేంద్రానికి ఉండదని వాదించారు. అసెంబ్లీకి వచ్చిన బిల్లులో అన్ని అంశాలు లేవని, అసలు విభజన ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాల్సిన హక్కు ప్రతి ఎమ్మెల్యేకూ ఉందని ఎంఎన్ రావు చెప్పారు. ఇలాంటి అంశాల్లో కూడా రహస్యం పాటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అసెంబ్లీలో సభ్యులకు వాదనలు వినిపించే హక్కుందని మరో న్యాయవాది పప్పు శ్యామల అన్నారు. రాష్ట్రపతి తెలంగాణ బిల్లును రికమండ్ చేయాలంటే ఆయన కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్రపతి ముందు సరైన సమాచారం ఉంటేనే అసెంబ్లీలో సభ్యులు తమ వాదనల్ని వినిపిస్తారని, అయితే ఈ బిల్లులో సమగ్ర సమాచారం లేదని పప్పు శ్యామల చెప్పారు.