ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి అధికార టీడీపీ ఎలా దొడ్డిదారిన వెళ్తుందో మరోసారి స్పష్టమైంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఫేక్ సర్వేలను తన అనుకూల మీడియాతో ప్రచారం చేసుకుంటోంది. ఏపీలో అధికారం టీడీపీదే అని లోక్‌నీతి సర్వే పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎస్‌డీఎస్ లోక్‌నీతి సర్వే సంస్థ తీవ్రంగా స్పందించింది. తాము ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించిన సర్వే ఫేక్ అని తేల్చిచెప్పింది.