ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేనిరీతిలో దూసుకుపోతోంది. ఫ్యాన్ ప్రభంజనంలో రాష్ట్రమంతా టీడీపీ కొట్టుకుపోతుండగా.. ఏకంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సైతం ఫ్యాన్ షాక్ ఇస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.