ఓటరు నమోదుకు ఆఖరి అవకాశం.. | Last chance to enrollment as a Voter, says Bhanwar Lal | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుకు ఆఖరి అవకాశం..

Published Thu, Mar 6 2014 2:47 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

Last chance to enrollment as a Voter, says Bhanwar Lal

సాక్షి, హైదరాబాద్: లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో.. ఓటర్లుగా నమోదు చేసుకొనేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..  రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 9వ తేదీ (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ల జాబితాలతో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు అందుబాటులో ఉంటారు.  జాబితాలో పేరు ఉందో లేదో చూసుకుని.. పేరు లేకపోతే అక్కడికక్కడే ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు ఓటర్‌గా నమోదుకు అవకాశం ఉంటుంది.  ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ‘వీఓటీఈ’ అని టైప్ చేసి గుర్తింపు కార్డు నంబర్‌తో 9246280027 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపితే కొద్ది సేపట్లోనే పేరు ఉందో లేదో జవాబు వస్తుంది.   పోలింగ్‌కు వారం రోజుల ముందు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేస్తారు. రెండు దఫాలు ఈ పంపిణీ జరుగుతుంది. అయినా స్లిప్‌లు అందనివారికి పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం వద్ద ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement