నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో 50వేల మెజారిటీతో గెలువబోతున్నానని ప్రజా శాంతిపార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ధీమావ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోకవర్గంలో యువత, మహిళలు ఇతర ప్రజలు నాపై ప్రేమ చూపించారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడులో సందర్శిస్తున్న సమయంలో తనపై మూడు సార్లు దాడులకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆర్‌ఓ ఇతర అధికారులు రక్షించారని తెలిపారు. 155 దేశాల్లో తిరిగినా దక్కని ప్రేమను మునుగోడు ప్రజలు ఇచ్చారని, వారికి జీవితాంతం కృతజ్ఞడునై ఉంటానని చెప్పారు.
మునుగోడులో ప్రజాస్వామ్యం ఖూనీ
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని పాల్ ఆరోపించారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా గెలిచే పరిస్థితి లేదన్నారు. ప్రచారం సందర్భంగా పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని, ఎస్పీ కూడా అధికార పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరించిందని ఆరోపించారు. కనీసం గన్‌మెన్లను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గద్దర్‌కు గన్‌మెన్లు ఇచ్చారు. నాకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు దేశాన్ని , రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని ఆరోపించారు. ఉప ఎన్నికలో అలాంటి పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు వారిని నమ్మలేదన్నారు.
ఎమ్మెల్యేలు కొనుగోలు అంతా డ్రామా...
ఎమ్మెల్యేల కొనుగోలు అంతా డ్రామా అని ఆయన ఆరోపించారు. సీఎం అయితే తెలంగాణను బంగారు తెలంగాణను చేస్తానన్నారు. అమిత్‌షా నన్ను పార్టీలో చేరమన్నాడు. మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారన్నారు. నేను కాదని చెప్పానని , పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని చెప్పాడన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు టీఆర్‌ఎస్ ఒప్పుకుందని , బీజేపీ ఇండరైక్టుగా మద్దతు ఇస్తే కాంగ్రెస్ నేరుగా మద్దతిచ్చిందని కాబట్టి గెలిచేది ఇక నేనే అని ఆయన చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment