రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
విభజన జరిగినా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 76.26 లక్షల మంది ఓటర్లుగా నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున కొత్త ఓటర్లు నమోదు కావడం ఇదే తొలిసారిని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. శనివారం నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రాష్ట్రంలో 69,014 పోలింగ్ కేంద్రాలతోపాటు జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రా ల్లో నిర్వహిస్తామని చెప్పారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి కార్యక్రమం ఉంటుం దన్నారు. భన్వర్‌లాల్ చెప్పిన వివరాలివీ..
శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 69,014 పోలింగ్ కేంద్రాల్లో ఆయా పరిధిలోని ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తాం. అక్కడే బూత్ స్థాయి ఆఫీసర్లు ఓటు నమోదు పత్రాలతో ఉంటారు. జాబితాలో పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ చూసుకోండి. పేరు లేకపోతే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోండి.
సవరణ ప్రక్రియలో భాగంగా... మృతి చెందిన, రెండు మూడు చోట్ల పేర్లు ఉన్న, ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లిన 33.64 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించాం. అలాంటి వారు శనివారం ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలి.
జాబితాలో పేరు ఉందో తెలుసుకోవడానికి 9246280027కు ఠిౌ్ట్ఛ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ ఎస్‌ఎంఎస్ చేయాలి.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కొత్తగా ఓటరుగా నమోదైన ఐదుగురికి కలర్ ఫొటోతో గుర్తింపు కార్డులను జారీ చేస్తాం.
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. వచ్చే నెలాఖరు లేదా మార్చి తొలి వారంలో షెడ్యూల్ వస్తుంది. ఒక రాష్ట్రం ఉన్నా రెండు రాష్ట్రాలున్నా ఎన్నికలు జరుగుతాయి.
గత ఏడాది జనవరి 15న ప్రకటించిన ఓటర్ల జాబితాలో 5.81 కోట్ల మంది ఓటర్లుండగా ఇప్పుడు కొత్తగా ఓటర్ల నమోదు, తొలగింపు తర్వాత రాష్ట్ర ఓటర్ల సంఖ్య 6.24 కోట్లకు చేరింది. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 31న ప్రకటిస్తాం. ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 50,10,024 మంది ఓటర్లున్నారు.
రాష్ట్రంలో కొత్త ఓటర్లు 76.26 లక్షలు
Published Sat, Jan 25 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement