రంగారెడ్డిని రెండు జిల్లాలుగా చేయాలి: కోదండరామ్ | Rangareddy distric should be devided in tow: Kodandaram | Sakshi
Sakshi News home page

రంగారెడ్డిని రెండు జిల్లాలుగా చేయాలి: కోదండరామ్

Published Tue, Oct 13 2015 2:40 PM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM

రంగారెడ్డి జిల్లాను తూర్పు, పశ్చిమగా రెండు జిల్లాలు చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు.

రంగారెడ్డి జిల్లాను తూర్పు, పశ్చిమగా రెండు జిల్లాలు చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కోదండరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శేఖర్, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమాఖ్య నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement