తెలంగాణ అభివృద్ధికి పునరంకితమవుతాం | fight for telangana state devolopment : proffessor kodandaram | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధికి పునరంకితమవుతాం

Published Sun, Dec 25 2016 2:12 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

తెలంగాణ అభివృద్ధికి పునరంకితమవుతాం - Sakshi

తెలంగాణ అభివృద్ధికి పునరంకితమవుతాం

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం అవుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. జేఏసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జేఏసీ కార్యాలయం వద్ద శనివారం ఆయన జెండాను ఎగురవేశారు. జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ఇటిక్యాల పురుషోత్తం, ప్రహ్లాద్, భైరి రమేశ్‌ తదితరులతో కలసి ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం ముందుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నూతన రాష్ట్రంలో కొత్త అభివృద్ధి పంథాను అవలంబించాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని శక్తులను ఏకోన్ముఖంగా పనిచేసేలా జేఏసీ కృషి చేసిందన్నారు. భవిష్యత్‌ కార్యాచరణను ఆదివారం జరిగే స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement