అభివృద్ధి జరగడం లేదు: కోదండరామ్ | development is not up to the mark, says kodandaram | Sakshi
Sakshi News home page

అభివృద్ధి జరగడం లేదు: కోదండరామ్

Published Mon, Oct 17 2016 4:23 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

అభివృద్ధి జరగడం లేదు: కోదండరామ్ - Sakshi

అభివృద్ధి జరగడం లేదు: కోదండరామ్

తెలంగాణ ప్రజలు ఆశించినంత అభివృద్ధి రాష్ట్రంలో జరగడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. తాను ఈనెల 23వ తేదీన రైతుదీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికే ఈ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షలో పలువురు జేఏసీ నేతలు, రైతు సంఘాల నేతలు కూడా పాల్గొంటారన్నారు.

మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కోదండరామ్ కలిశారు. కొత్త జిల్లాలు, మండలాల్లో ప్రజల డిమాండ్లపై ఆయనతో చర్చించారు. గట్టుప్పల్, నాగిరెడ్డిపేట మండలాల సమస్యను పరిష్కరించాలని రాజీవ్ శర్మను కోదండరామ్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement