
'ఓటుకు కోట్లు' కేసు బాబు వ్యక్తిగతం..కానీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 లోని సెక్షన్-8 పై వివాదాలు సృష్టించవద్దని ఏపీ నాయకులను ఉద్దేశించి ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 'ఓటుకు నోటు' కేసు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యక్తిగతమైన అంశమని అన్నారు. ఈ కేసు విషయమై మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి సంబంధించిన కేసును రెండు ప్రాంతాల తగాదాగా చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కేసును అవకాశంగా తీసుకుని ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్థమన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా రెండు ప్రాంతాల మధ్య గొడవ జరగలేదని ఆయన గుర్తుచేశారు. ఈ నెల 21 న ప్రొఫెసర్ జయశంకర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.