section-8
-
'అలా అంటే..ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదు'
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంటే ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు, ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు అన్న రీతిలో రాష్ట్రపతి ప్రసంగించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శనివారం కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య సెక్షన్-8 అంశాన్ని ముడిపెట్టే విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలను గౌరవించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని ఆయన తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలసి మెలసి ఉండాలని, రెండు రాష్ట్రాలు సామరస్య వాతావరణంలో పనిచేయాలని, దేశభ్యున్నతికి పాటుపడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆకాంక్షించారు. -
ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదు
-
'ఓటుకు కోట్లు' పై రెండు రోజుల్లో స్పందిస్తా
నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' వ్యవహారంతో పాటు ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8 అంశాలపై రెండు రోజుల్లో తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అవసరమైతే ఈ విషయాలపై ఈ వారం చివర్లోగానీ లేదా వచ్చే వారం మొదట్లోగానీ విలేకరుల సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నారు. 'తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని అంటారు.. అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలతో ప్రభుత్వాలను నడిపితే భావితరాల మధ్య కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి' అని ఆయన ట్వీట్ చేశారు. -
రెండు రోజుల్లో స్పందిస్తా: పవన్ కల్యాణ్
-
’చంద్రబాబు చేసేవన్నీ ప్రజలదృష్టి మరల్చేందుకే’
-
ఓటుకు కోట్లు వ్యవహారంపై విస్తృత చర్చ!
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రితో గవర్నర్ నరసింహన్ భేటీ సుదీర్ఘంగా సాగింది. దాదాపు 40 నిమిషాలకు పైగా భేటీ సాగింది. మొదట హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో శుక్రవారం సమావేశమైన గవర్నర్.. ఆ తర్వాత రాజ్‌నాథ్ కార్యాలయానికి వెళ్లారు. రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిగిన భేటీలో హోంశాఖ కార్యదర్శి గోయల్, సంయుక్త కార్యదర్శి అలోక్‌కుమార్ పాల్గొన్నారు. సెక్షన్-8, ఓటుకు కోట్లు వ్యవహారంపై నలుగురూ చర్చించినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత గోయల్, అలోక్‌కుమార్ వెళ్లిపోయారు. తర్వాత రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ నరసింహన్ మధ్య సమావేశం జరిగింది. భేటీ అనంతరం గవర్నర్ బయటకు వచ్చాక.. హోంశాఖ కార్యదర్శి గోయల్ మళ్లీ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. ఓటుకు కోట్లు వ్యవహారంపై విస్తృత చర్చ జరిగినట్టు సమాచారం. కేసు విచారణను దర్యాప్తు సంస్థకు విడిచి పెట్టాలన్నది కేంద్రం వైఖరిగా కనిపిస్తోందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సెక్షన్-8, ఓటుకు కోట్లు కేసూ రెండూ వేర్వేరుగా చూడాలన్నదే కేంద్రం వైఖరని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ వ్యవహారం నేపధ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని గవర్నర్‌కు నిర్దేశించినట్టు సమాచారం. సెక్షన్-8 అమలుపై కొన్ని సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. -
సెక్షన్-8పై నో కామెంట్- ఉత్తమ్
గ్రేటర్ వార్డు విభజనలో అక్రమాలు జోక్యం చేసుకోవాలంటూ ఈసీకి ఫోను సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు నేపథ్యంలో తెరపెకి వచ్చిన సెక్షన్ 8 గురించి వ్యాఖ్యలు చేయబోమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 8 వంటి సున్నితమైన అంశంపై మాట్లాడటం వల్ల రాజకీయ ఇబ్బందులు ఉంటాయని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకోసం జరుగుతున్న వార్డుల విభజనలో అక్రమాలు జరుగుతున్నాయని, జీహెచ్ఎంసీ అధికారులు ఏకపక్షంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బట్టి తమకు అనుకూలంగా వార్డుల విభజన ప్రక్రియను టీఆర్ఎస్కు, ఎంఐఎం పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా విభజన చేస్తున్నారని ఆరోపించారు. వార్డుల విభజనకు జనాభా, భౌగోళిక ప్రాంతం వంటి ప్రాతిపదికలను అధికారులు పట్టించుకోవడం లేదని ఉత్తమ్ విమర్శించారు. వార్డుల విభజనలో అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి ఫోను చేసి ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. గ్రేటర్ ఎన్నికలకోసం స్వచ్ఛహైదరాబాద్‌ను రాజకీయ కార్యక్రమంగా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చి, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గ్రేటర్ ఎన్నికల్లో పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఉత్తమ్ ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా హైదరాబాద్‌లో ముస్లిం ఓటర్లు ఎంఐఎంకు విశ్వాసంగా ఉన్నా, అధికారంలో టీఆర్ఎస్తో కుమ్మక్కు అయిందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అథారిటీ, వక్ఫ్‌భూముల తిరిగి స్వాధీనం, ముస్లిం యువకులను ఎన్కౌంటర్ పేరిట కాల్చిచంపడం వంటి అంశాలపై ప్రజల్లో చర్చకు పెట్టగలిగామన్నారు. ఈ అంశాలపై ఎంఐఎంను, టీఆర్ఎస్ను ముస్లింలు అసహ్యించుకుంటున్నారని ఉత్తమ్ వివరించారు. ఏ ప్రాంతం వారైనా, ఏ భాషవారైనా హైదరాబాద్‌లో స్వేచ్చగా జీవించడానికి కాంగ్రెస్ కృషిచేస్తుందన్నారు. సెటిలర్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సన్నాహక సమావేశాలు 18 నియోజకవర్గాల్లో పూర్తయినాయని ఉత్తమ్ వెల్లడించారు. అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన సికింద్రాబాద్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాల్లో ఈ నెల 30 లోగా పూర్తిచేస్తామని చెప్పారు. వీటిలో ఏఐసీసీ నేతలు కొప్పుల రాజు, ఆర్.సి.కుంతియా, టీపీసీసీ నేతలు పాల్గొంటారని చెప్పారు. 28న పీవీ వర్థంతి మాజీ ప్రధానమంత్రి పి.వి.నర్సింహ్మారావు వర్థంతి కార్యక్రమాన్ని ఈ నెల 28న గాంధీభవన్‌లో నిర్వహించనున్నట్టుగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ వర్థంతి కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి పాల్గొంటున్నట్టుగా ఆయన తెలిపారు. -
సెక్షన్-8 వద్దంటూ ఆందోళన
సనత్ నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు శాంతిభద్రతల విషయంలో ఎలాంటి సమస్య తలెత్తలేదని, అలాంటప్పుడు సెక్షన్-8ను ఎందుకు తెరమీదకు తీసుకు వస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. 'సెక్షన్-8 మాకొద్దు' అంటూ ప్లకార్డులు చేతబూని సనత్‌నగర్‌లో బుధవారం టీఆర్ఎస్ నేత వై.బాలరాజ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసు ఉదంతాన్ని పక్కదోవ పట్టించడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే సెక్షన్-8 జపం చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్రులు, మిగతా ప్రాంతాల వారనే తేడా లేకుండా అందరి సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజలు సెటిలర్స్‌తో ఎంతో సఖ్యతగా ఉంటారనడానికి సనత్‌నగర్ ఒక ఉదాహరణ అన్నారు. ఇరు ప్రాంతాల మధ్య తారతమ్యం అనేది రాకుండా సెటిలర్స్ కూడా తాము ఇక్కడ వారమే అనే భావనను వారిలో తీసుకువచ్చి వారికి కావాల్సిన వసతులను కల్పించడంలో ముందువరుసలో ఉన్నారని తెలిపారు. -
ఇద్దరు సీఎంల బాగోతంపై గవర్నర్‌కు లేఖ
హైదరాబాద్ : ఎమ్మెల్యే కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్, ఇద్దరు ముఖ్యమంత్రుల బాగోతంపై గవర్నర్‌కు లేఖ రాసినట్లు ఆంధ్రప్రద్రేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఇందిరాభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జైలుకెళతానన్న భయంతోనే చంద్రబాబు నాయుడు సెక్షన్-8 తెరపైకి తెచ్చారని రఘువీరా విమర్శించారు. సెక్షన్-8 సహా రాష్ట్ర విభజన చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు సెక్షన్-8పై ప్రజలను గందరగోళపరుస్తున్నారని అన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు దోషులేనని రఘువీరా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్‌పై నిగ్గు తేల్చాలని, కేంద్ర పెద్దలు మధ్యవర్తులుగా ఉండి ఇద్దరు సీఎంల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను గందరగోళపరుస్తున్నారని రఘువీరా మండిపడ్డారు. -
'ఆంధ్రులకొచ్చిన ఉపద్రవం ఏమిలేదు'
విజయవాడ: ఓటుకు కోట్లు కేసుపై భయంతోనే చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆయన బుధవారం విజయవాడలో మాట్లాడుతూ సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఉమ్మడి రాజధానిలో ఆంధ్రులకొచ్చిన ఉపద్రవం ఏమి లేదని రామకృష్ణ తెలిపారు. -
ప్రజలను పక్కదారి పట్టించేందుకే: బుగ్గన
హైదరాబాద్ : సెక్షన్-8పై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, నెలకో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని డోన్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకే సెక్షన్-8 వాదనను తెరమీదకు తెచ్చారని బుగ్గన వ్యాఖ్యానించారు. ఇప్పటికే సెక్షన్-8 అమల్లో ఉందని ఆయన అన్నారు. ఇక రాజధాని నిర్మాణం విషయంలోనూ ప్రభుత్వం...ఎవరినీ సంప్రదించలేదని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూమిపూజకు కనీసం ఒక్క రాజకీయ పార్టీని కూడా ఆహ్వానించలేదన్నారు. -
'ప్రజలను పక్కదారి పట్టించేందుకే'
-
చంద్రబాబుకు ఇప్పుడు గుర్తొచ్చిందా?
న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడుకు సెక్షన్-8 గుర్తుకు వచ్చిందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫిరాయింపులు ప్రోత్సహించి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఫిరాయింపులపై స్పీకర్ మౌనంగా ఉండటం, టీడీపీ సభ్యుడితో గవర్నర్ ప్రమాణం చేయించడం, ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని నారాయణ అన్నారు. -
సెక్షన్-8పై రౌండ్ టేబుల్ సమావేశం రసాభాస
-
’సెక్షన్-8 అంటే మరో ఉద్యమమే’
-
సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎస్, డీజీపీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. 16 రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో ఎస్సీ కమిషన్ భేటీ కానుంది. ఆ సదస్సులో పాల్గొన్న అనంతరం సీఎస్, డీజీపీ కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. సెక్షన్-8 అంశంపై కేంద్ర హోంశాఖతో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'ఆ పని చేయ్...ఈ పని చేయ్ అని చెప్పలేరు'
హైదరాబాద్ : చట్టాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెపుతున్న మాటలు సరైనవి కాదని ఐపీఎస్ మాజీ అధికారి ఆంజనేయ రెడ్డి అన్నారు. సాక్షిటీవీ 'ఫోర్త్ ఎస్టేట్' కార్యక్రమంలో ఆయన గురువారం మాట్లాడుతూ ఇప్పుడు నడుస్తున్న (ఓటుకు కోట్లు) ఏసీబీ కేసుకు, సెక్షన్-8కు సంబంధం లేదన్నారు. ఏసీబీ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఏపీ మంత్రులు సెక్షన్-8ను ప్రస్తావిస్తున్నారని అనుకుంటున్నానని ఆంజనేయ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని అంశాలపై కేసులు మాత్రమే ఎన్నికల సంఘానికి చెప్పాల్సి ఉంటుందని, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసు రిజిస్టర్ చేయడానికి, దర్యాప్తు చేయడానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదని చెప్పారు. ఈ పని చేయ్, ఆ పని చేయ్ అని ముఖ్యమంత్రి...డీజీపీకి చెప్పలేరని ఆంజనేయ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తులో గవర్నర్ కానీ, సీఎంకానీ, ఎన్నికల సంఘం కానీ జోక్యం చేసుకోలేదన్నారు. సీఆర్పీసీ ప్రకారం కేసు ఎక్కడైనా రిజిస్ట్రర్ కావొచ్చని... కాని దర్యాప్తు చేసే అధికారం నేరం జరిగే పరిధిలోని పోలీసులదే అన్నారు. విశాఖ, రాజమండ్రిల్లో కేసులు రిజిస్ట్రర్ చేసుకున్నా..వాళ్లొచ్చి దర్యాప్తు చేయలేరని ఆంజనేయరెడ్డి అన్నారు. క్రిమినల్ కేసుల్లో నేరం ఎక్కడ జరిగిందనేది చాలా ముఖ్యమైన అంశమని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సత్యప్రసాద్ అన్నారు. నేరం జరిగే ప్రదేశం బట్టి..న్యాయపరిధి ఎక్కడుందనేది నిర్ణయం అవుతుందన్నారు. వేరేచోట కేసులు పెడితే చెల్లదని, ఘటనలు హైదరాబాద్‌లో జరిగితే... కేసీఆర్ మీద ఎక్కడెక్కడో కేసులు పెడితే..అది కరెక్ట్ కాదన్నారు. ఏసీబీకి అధికారం లేదంటూ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. దర్యాప్తు జరక్కుండా ఎన్నికల సంఘం కూడా అడ్డుకోలేదన్నారు. ఇరత రాష్ట్రాల్లో కేసులు ఒక వ్యక్తిని బెదిరించడం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే అని, అది మైండ్ గేమ్ మాత్రమే అని అన్నారు. నోటీసు తీసుకోకపోతే సంబంధింత వ్యక్తిని కస్టడీలోకి తీసుకునే అధికారం కూడా ఉందని హైకోర్టు న్యాయవాది కైలాశ్‌నాథ్ రెడ్డి అన్నారు. నోటీసు ఇచ్చాక దర్యాప్తునకు సహకరిస్తే..అరెస్ట్ చేసే అవసరం కూడా లేదన్నారు. కానీ, నోటీసును ఉల్లంఘిస్తే మాత్రం కస్టడీలోకి తీసుకునే అధికారం కూడా ఉందన్నారు. -
'ఓటుకు కోట్లు' కేసు బాబు వ్యక్తిగతం..కానీ
-
'కొత్త సీఎం ఎవరని ఏపీ మంత్రులు చర్చిస్తున్నారు'
హైదరాబాద్ : 'ఓటుకు నోటు' కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు ఖాయమని తేలిపోవడంతో, ఆ రాష్ట్ర మంత్రులంతా తమ నూతన సీఎం ఎవరా అని చర్చించుకుంటున్నారని తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని, ఆయన తప్పు చేశాడని ప్రజలు, కేంద్రం కూడా నమ్మటం వల్ల బాబు భయపడుతున్నాడని పేర్కొన్నారు. ఈ కేసులోని అసలు విషయాలు దాచిపెట్టాలని ప్రయత్నిస్తూ, ఏపీ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. అసలు ఏపీ పోలీసులకు హైదరాబాద్‌లో ఏం పని..? తెలంగాణలో ఏపీ పోలీసు స్టేషన్లు పెడుతుంటే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు..’అని మంత్రి అన్నారు. కేసును తప్పుదోవ పట్టించి బాబు లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాబు వ్యవహారంపై కేంద్రం కూడా చేతులు ఎత్తేసిందని, ఇక లాభం లేదని సెక్షన్-8 ను పదే పదే తెరపైకి తెచ్చి తప్పించుకునేందుకు కొత్త దారులు వెదుకుతున్నాడని ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని, తెలంగాణలో శాంతి భద్రతలపై ఏపీ పోలీసులకు అవగాహన లేదని మంత్రి మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
'ఓటుకు కోట్లు' కేసు బాబు వ్యక్తిగతం..కానీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 లోని సెక్షన్-8 పై వివాదాలు సృష్టించవద్దని ఏపీ నాయకులను ఉద్దేశించి ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 'ఓటుకు నోటు' కేసు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యక్తిగతమైన అంశమని అన్నారు. ఈ కేసు విషయమై మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి సంబంధించిన కేసును రెండు ప్రాంతాల తగాదాగా చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసును అవకాశంగా తీసుకుని ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్థమన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా రెండు ప్రాంతాల మధ్య గొడవ జరగలేదని ఆయన గుర్తుచేశారు. ఈ నెల 21 న ప్రొఫెసర్ జయశంకర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.
-
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ, తాజా పరిణామాలపై చర్చ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మరోసారి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఆయన బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.