ఇద్దరు సీఎంల బాగోతంపై గవర్నర్కు లేఖ | raghuveera reddy takes on chandrababu naidu, and kcr over section-8 | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఎంల బాగోతంపై గవర్నర్కు లేఖ

Published Wed, Jun 24 2015 2:18 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

ఇద్దరు సీఎంల బాగోతంపై గవర్నర్కు లేఖ

ఇద్దరు సీఎంల బాగోతంపై గవర్నర్కు లేఖ

హైదరాబాద్ : ఎమ్మెల్యే కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్, ఇద్దరు ముఖ్యమంత్రుల బాగోతంపై గవర్నర్కు లేఖ రాసినట్లు ఆంధ్రప్రద్రేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఇందిరాభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఈ అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్కు లేఖ రాసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జైలుకెళతానన్న భయంతోనే చంద్రబాబు నాయుడు సెక్షన్-8 తెరపైకి తెచ్చారని రఘువీరా విమర్శించారు.

సెక్షన్-8 సహా రాష్ట్ర విభజన చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు సెక్షన్-8పై ప్రజలను గందరగోళపరుస్తున్నారని అన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు దోషులేనని రఘువీరా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్పై నిగ్గు తేల్చాలని, కేంద్ర పెద్దలు మధ్యవర్తులుగా ఉండి ఇద్దరు సీఎంల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను గందరగోళపరుస్తున్నారని రఘువీరా మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement