
'ఓటుకు కోట్లు' పై రెండు రోజుల్లో స్పందిస్తా
'ఓటుకు కోట్లు' వ్యవహారంతో పాటు ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8 అంశాలపై రెండు రోజుల్లో తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' వ్యవహారంతో పాటు ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8 అంశాలపై రెండు రోజుల్లో తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అవసరమైతే ఈ విషయాలపై ఈ వారం చివర్లోగానీ లేదా వచ్చే వారం మొదట్లోగానీ విలేకరుల సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నారు. 'తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని అంటారు.. అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలతో ప్రభుత్వాలను నడిపితే భావితరాల మధ్య కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి' అని ఆయన ట్వీట్ చేశారు.