
తెగేదాకా లాగొద్దు: పవన్ కల్యాణ్
ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ నాయకుడు ఎట్టకేలకు ఒక ట్వీట్ వదిలారు. అదీ దొరికీ దొరకుండా.. అడిగీ అడగకుండా.. ప్రశ్నించి ప్రశ్నించకుండా! 'ఓటుకు కోట్లు' వ్యవహారం బయటపడిన నాలుగు వారాల తర్వాత, ఈ ఉదంతం ముదిరి పాకాన పడిన తర్వాత ప్రశ్నించే నాయకుడు ఎక్కడా అంటూ పలు వర్గాలు గొంతు చించుకున్న తర్వాత ట్విటర్ లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఇన్ని రోజుల మౌనముద్ర ఎవరికీ తెలియదు. అపుడెప్పుడో ఏపీ రాజధాని ప్రాంతంలో ఒకరోజు హడావుడి తర్వాత వినిపించకుండా పోయిన ప్రశ్నించే నాయకుడు ఇప్పుడు కూడా ప్రశ్నించిందేమీ లేదు. రెండు రాష్ట్రాల ప్రజానీకానికి, రాజకీయ నాయకులకు ఉపదేశం చేశారు.
'రాజకీయాలంటే ఎత్తుకు పై ఎత్తులేనా?' అని ప్రశ్నించి ప్రశ్నించకుండా ఒక మాట వదిలారు. అక్కడితో ఆగారా... లేదు నెల్సన్ మండేలాను గుర్తుకు తెచ్చుకోమన్నారు. ప్రజల మంచి కోసం, అంతర్యుద్థం తలెత్తకుండా ఉండేందుకు నెల్సన్ సామరస్యపూర్వక ధోరణి అవలంభించారు. అదీ ఆ మహానీయుడి గొప్పతనం. మన రాజకీయ నాయకులు కూడా ఆ మార్గం అవలంభిస్తారని సలహాతో కూడిన ప్రవచనం కూడా ఒకటి చేశారు. తెగేదాకా లాగొద్దు అని కూడా చెప్పారు. మీరు ఇదే ధోరణితో కొనసాగితే ప్రజలు ఇబ్బందులు పడతారనే ఆందోళన కూడా వెలిబుచ్చారు. ప్రశ్నించే నాయకుడు ఏమని ప్రశ్నించారో ఆయన మాటల్లోనే చదవండి.
IF POLITICS IS ALL ABOUT SETTLING SCORES,then I wonder, if,the Late Nelson Mandela would have had the same attitude like some of our leaders
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015
then imagine what he could have done to the South African Apartheid Regime and the white people
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015
who tortured & humiliated him & the black people for decades.,
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015
But as a Leader he has chosen a Path of Reconciliation to avoid a civil war and for the larger Good of the people.
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015
That's the greatness of his Noble leadership and I hope our leaders walk on the Path that he has shown. 'తెగే దాక ఏది లాగద్ధు అంటారు '
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015
Still.. if the leaders take it to that extent then the very people who put them in Power will suffer. And one has to be aware of it.
— Pawan Kalyan (@PawanKalyan) June 27, 2015
అయితే ఒకటే ప్రశ్న. ఇన్ని రోజుల మౌనం వెనుక కారణమేమిటో? పొరపాటు.. పొరపాటు... ప్రశ్నించే హక్కు మనకి ఉందా! లేదేమో కదా! పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడమా!