'సెక్షన్ 8 విధించడానికి నేను వ్యతిరేకం' | i am against section 8 in hyderabad, says pawan kalyan | Sakshi
Sakshi News home page

'సెక్షన్ 8 విధించడానికి నేను వ్యతిరేకం'

Published Mon, Jul 6 2015 5:32 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'సెక్షన్ 8 విధించడానికి నేను వ్యతిరేకం' - Sakshi

'సెక్షన్ 8 విధించడానికి నేను వ్యతిరేకం'

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 విధించడానికి తాను వ్యతిరేకమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సెక్షన్ 8 పేరుతో మరోసారి కేంద్రానికి అధికారం కట్టబెట్టేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఈ అంశాలపై ఏమన్నారంటే..
 

* ప్రజల మధ్య అంతర్యుద్ధాలు జరిగితే అప్పుడు సెక్షన్ 8 పెట్టాల్సిన అవసరం వస్తుంది తప్ప చంద్రబాబు మీద కేసు పెడితే సెక్షన్ 8 అవసరం లేదు
* హైదరాబాద్లో సెక్షన్ 8 విధించడానికి నేను వ్యతిరేకం
* విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది
* ఎటూ ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఇప్పుడు హైదరాబాద్లో సెక్షన్ 8 పేరుతో కేంద్రానికి అప్పగిస్తే మళ్లీ అన్యాయం జరుగుతుంది
* ఉద్యమాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఏమైనా చెల్లుతుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం.. తర్వాత పక్షపాతం వహిస్తున్నారని అనిపిస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది

* ఎన్డీయే, యూపీఏలు ఒక కమిటీ వేసి, ఇక్కడి వ్యవహారాలు పరిశీలించేలా చూడండి
* చంద్రబాబు చెప్పిన లాంటి సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ మార్గాలు సూచించాలి
* మీడియా స్వేచ్ఛను హరించకండి. అలా హరించినంత మాత్రాన వాస్తవాలు బయటకు రాకుండా ఉండవు
* ఎమర్జెన్సీ సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛమీద నియంత్రణ విధించినప్పుడు రాంనాథ్ గోయెంకా సంపాదకీయం స్థానంలో తెల్ల కాగితం వదిలేసి ప్రచురించారు

* రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని చానళ్లను అనధికారికంగా ఆపినట్లు తెలిసింది. అలా చేయకండి
* హైదరాబాద్ తెలంగాణ రాజధాని.. అందులో తిరుగులేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు ఇది ఉమ్మడి రాజధాని. ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయకండి.
* ఎంతసేపూ హైదరాబాద్ లాంటి నగరాన్ని తయారుచేయాలని ఏపీ పాలకులు చూడొద్దు. భవనాలు కట్టొచ్చు గానీ ప్రజలను తీసుకెళ్లలేరు

* విభజన సమస్యలు తీర్చాల్సిన వాళ్లు కొట్టుకుంటూ కూర్చుంటే ఇబ్బంది
* అందరి కళ్లలో దూలాలున్నాయి.. సైజులే తేడా
* దీన్ని పరిష్కరించకపోతే అంతర్యుద్ధాలు జరుగుతాయి
* రాజధాని ఇచ్చి తెలంగాణను సంతోషపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని యూపీఏ, ఎన్డీయే రెండ చెప్పాయి

* తిడితే కేసీఆర్లా తిట్టాలి.. పడితే పౌరుషం లేని ఆంధ్రప్రదేశ్ ఎంపీల్లా పడాలి
* వాళ్లకు పౌరుషం, ఆత్మగౌరవం లేవా అని అనిపిస్తోంది
* ఉత్తరాది ఎంపీలతో కొట్టించుకుని పార్లమెంటు నుంచి బయటకు వచ్చారు

* కేశినేని నాని తనకు ఎంపీ సీటు కావాలని బలంగా ఊగిపోయారు. ఇప్పుడేం చేస్తున్నారు? పార్లమెంటు గోడలు చూస్తూ ఆశ్చర్యపోతున్నారా.. ప్రత్యేక హోదా కోసం ఏమైనా చేస్తున్నారా?
* బీజేపీ తరఫున ఇద్దరు ఎంపీలున్నారు.. మీరు ఏం చేస్తున్నారు
* హైకమాండ్ మీద నమ్మకం ఉందంటూ కాలం గడిపేస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement