ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయాలి: పవన్ కల్యాణ్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును కోర్టులే తేల్చాలని, ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
* నాకు అభిప్రాయం లేక కాదు.. నా అభిప్రాయాలు నాకున్నాయి
* రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూబాధ్యతగా మాట్లాడాలి
* ఎలా పడితే అలా మాట్లాడేందుకు నేను ఇష్టపడను
* నోరుచేసుకు బతుకు బిడ్డా అని ఒక తల్లి చెప్పిందట.. నాయకులు నోరు పారేసుకోవడం వల్ల ప్రజలకు అనర్థాలు జరుగుతున్నాయి
* మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నేను ఆయనను కలిశాను
* తెలుగుజాతి ఐక్యత దేశ సమగ్రతలో ఒక భాగం అని ఆయన అన్నారు.
* తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు తెలుగుజాతి ఐక్యతకు తొలి అడుగు వేశారా అనిపించింది.
* యాదాద్రి గుడికి విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్ సాయి అనే ఆర్కిటెక్టును పెట్టడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం
* తెలంగాణ సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం
* అవినీతి గురించి మాట్లాడాతానన్నావు.. ఎందుకు మాట్లాడలేదని ఎంపీ వి.హనుమంతరావు అన్నారని నా దృష్టికి వచ్చింది
* వర్తమాన రాజకీయాలు నీతి, నిజాయితీలకు పుట్టినిల్లు కావని చిన్న పిల్లాడు కూడా చెబుతాడు
* రేవంత్ రెడ్డి విషయం తప్పా.. ఒప్పా అనేది కోర్టులు నిర్ణయించాలి
* ఇలాంటి సమయంలో ఇంత రాజకీయ క్రీడలు ఆడే పద్ధతి రెండు రాష్ట్రాలకు ఉందా అనిపిస్తోంది
* రెండు రాష్ట్రాలకు చాలా సమస్యలు, బాధ్యతలు ఉన్నాయి
* సరిహద్దు సమస్యలున్నాయి, ఆస్తుల సమస్యలున్నాయి
* ప్రజల అవసరాల కంటే పార్టీ ప్రయోజనాలను ముందుకు నెట్టడం వల్లే సమస్యలు వస్తున్నాయి
* ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం
* రాజకీయ క్రీడలకు అలవాటు పడిపోయి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ప్రజా సమస్యలు ఎప్పుడు తీరుస్తారు?
* రెండు రాష్ట్రాల సీఎంలకు చాలా బాధ్యతలున్నాయి.. ఇలాంటి సమయంలో ఇలా చేసుకుంటూ వెళ్లిపోతే..
* కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు
* తలసాని శ్రీనివాస యాదవ్ను టీఆర్ఎస్లోకి తీసుకెళ్లగలరు గానీ సనత్ నగర్ ప్రజల నమ్మకాన్ని తీసుకెళ్లగలరా?
* ప్రజాసమస్యలు తీర్చడం మానేసి కోర్టుకేసులు, ఏసీబీ కేసులు .. ఇలా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు
* నేను మార్చి 14న రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఒకటే భయం అని మోదీకి చెప్పాను
* వ్యవస్థలు కొట్టుకుంటే అంతర్యుద్ధాలకు దారితీస్తుందని చెప్పాను
* జల వివాదాల్లో రెండు రాష్ట్రాల పోలీసులు తలలు పగలగొట్టుకున్నారు
* రెండు శత్రుదేశాల సైనికుల్లా కొట్టుకుంటే సామాన్య ప్రజలను రక్షించేదెవరు?
* హైదరాబాద్ 60 ఏళ్ల పాటు ఆంధ్రులకు రాజధాని. ఇప్పుడు అక్కడ కొత్త రాజధాని కట్టడానికి డబ్బులు కూడా లేవు
* ఒక కంట్లో వెన్న, మరో కంట్లో సున్నం పెట్టినట్లు కేంద్రం ఉంది
* రాష్ట్రాన్ని విడగొట్టింది యూపీఏ, ఎన్డీయే
* రెండు పార్టీలకూ రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది
* మోదీ ఈ సమస్యల వైపు చూడాలని కోరుతున్నా.
* ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తారా..
* నిజానిజాలు తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలి. అది నిజమైతే కఠినమైన చర్యలు తీసుకోవాలి.
* జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు బాధ్యత గల నాయకులు కూడా ఆంధ్రోళ్లు, సెటిలర్లు అని మాట్లాడొద్దని నేను ఇంతకు ముందు కూడా కోరాను
* హరీశ్ రావు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు
* ఆంధ్రోళ్లతో పంచాయతీ తీరలేదని ఎవరన్నా నాకు నచ్చదు
* చంద్రబాబును, టీడీపీని తిట్టాలనుకుంటే తిట్టండి. నన్ను తిట్టాలంటే పవన్ అనే పేరుతో తిట్టండి
* ఆంధ్రులంటే కమ్మ సామాజికవర్గం మాత్రమే కాదు.. అన్ని మతాలు, కులాల సమ్మేళనం