సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి 4,500 ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు తేలింది. వాటిల్లో కాంగ్రెస్‌కు చెందిన 190 మంది ఫోన్లు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వారిలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు సోదరులు, మిత్రులు, అనుచరులు సైతం ఉన్నారు.
ఇక ఫోన్ ట్యాపింగ్‌లో 80 శాతానికిపైగా ఎయిర్‌టెల్ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఎయిర్‌టెల్ సర్వీస్ ప్రొవైడర్ డేటాను ధ్వంసం చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
మరోవైపు ఫోన్ టాపింగ్ వ్యవహారం దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మీడియా ఛానెల్ నిర్వాహకుడు అరువెల శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.
ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీబీఐ అనుమతిచ్చింది. రెడ్ కార్నర్ నోటీసు కోసం హైదరాబాద్ పోలీసులు పంపిన నివేదికను సమ్మతించిన సీబీఐ.. ఇంటర్ పోల్‌కు లేఖ రాసింది.
చదవండి : మీ పాలనకో దణ్ణం చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment