ఓటుకు కోట్లు వ్యవహారంపై విస్తృత చర్చ! | Governor narasimhan delhi tour details | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు వ్యవహారంపై విస్తృత చర్చ!

Published Fri, Jun 26 2015 1:04 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

ఓటుకు కోట్లు వ్యవహారంపై విస్తృత చర్చ! - Sakshi

ఓటుకు కోట్లు వ్యవహారంపై విస్తృత చర్చ!

న్యూఢిల్లీ :  కేంద్ర హోంమంత్రితో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ సుదీర్ఘంగా సాగింది. దాదాపు 40 నిమిషాలకు పైగా భేటీ సాగింది. మొదట హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో శుక్రవారం సమావేశమైన గవర్నర్‌.. ఆ తర్వాత రాజ్‌నాథ్‌ కార్యాలయానికి వెళ్లారు. రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిగిన భేటీలో హోంశాఖ కార్యదర్శి గోయల్‌, సంయుక్త కార్యదర్శి అలోక్‌కుమార్‌ పాల్గొన్నారు. సెక్షన్‌-8, ఓటుకు కోట్లు వ్యవహారంపై నలుగురూ చర్చించినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత గోయల్‌, అలోక్‌కుమార్‌ వెళ్లిపోయారు. తర్వాత రాజ్‌నాథ్‌ సింగ్‌, గవర్నర్‌ నరసింహన్‌ మధ్య సమావేశం జరిగింది.

భేటీ అనంతరం గవర్నర్‌ బయటకు వచ్చాక.. హోంశాఖ కార్యదర్శి గోయల్‌ మళ్లీ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. ఓటుకు కోట్లు వ్యవహారంపై విస్తృత చర్చ జరిగినట్టు సమాచారం. కేసు విచారణను దర్యాప్తు సంస్థకు విడిచి పెట్టాలన్నది కేంద్రం వైఖరిగా కనిపిస్తోందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సెక్షన్‌-8, ఓటుకు కోట్లు కేసూ రెండూ వేర్వేరుగా చూడాలన్నదే కేంద్రం వైఖరని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ వ్యవహారం నేపధ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని గవర్నర్‌కు నిర్దేశించినట్టు సమాచారం. సెక్షన్‌-8 అమలుపై కొన్ని సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement