సెక్షన్-8పై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, నెలకో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని డోన్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : సెక్షన్-8పై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, నెలకో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని డోన్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకే సెక్షన్-8 వాదనను తెరమీదకు తెచ్చారని బుగ్గన వ్యాఖ్యానించారు. ఇప్పటికే సెక్షన్-8 అమల్లో ఉందని ఆయన అన్నారు. ఇక రాజధాని నిర్మాణం విషయంలోనూ ప్రభుత్వం...ఎవరినీ సంప్రదించలేదని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూమిపూజకు కనీసం ఒక్క రాజకీయ పార్టీని కూడా ఆహ్వానించలేదన్నారు.