ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 లోని సెక్షన్-8 పై వివాదాలు సృష్టించవద్దని ఏపీ నాయకులను ఉద్దేశించి ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 'ఓటుకు నోటు' కేసు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యక్తిగతమైన అంశమని అన్నారు. ఈ కేసు విషయమై మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి సంబంధించిన కేసును రెండు ప్రాంతాల తగాదాగా చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.