ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడుకు సెక్షన్-8 గుర్తుకు వచ్చిందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడుకు సెక్షన్-8 గుర్తుకు వచ్చిందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫిరాయింపులు ప్రోత్సహించి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఫిరాయింపులపై స్పీకర్ మౌనంగా ఉండటం, టీడీపీ సభ్యుడితో గవర్నర్ ప్రమాణం చేయించడం, ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని నారాయణ అన్నారు.