సాక్షి, అనంతపురం: ఫేక్ వీడియోపై తెలుగుదేశం పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అమెరికా నుంచి దొంగ సర్టిఫికెట్ తెప్పించున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీ సర్క్యూలేట్ చేస్తున్న సర్టిఫికెట్ తాము ఇచ్చింది కాదని ఎక్లిప్స్ సంస్థ ప్రకటించిందని వెల్లడించారు. ఈ మేరకు అనంతపురంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
‘టీడీపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఒకసారి ఆలోచించండి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఓటుకు నోటు కేసుపై ఎల్లో మీడియాలో ఏనాడైనా చర్చలు పెట్టారా?. ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి వచ్చారు.
చదవండి: (టీడీపీ మరో కుట్ర.. ఆ ప్రచారం నమ్మొద్దు)
ఆడపిల్ల కనిపిస్తే ముద్దాయినా పెట్టాలి.. లేదంటే కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎల్లో మీడియా ఎందుకు చర్చకు పెట్టలేదు?. లోకేష్ అశ్లీల చిత్రాలపై చర్చ ఎందుకు పెట్టరు?. ఫేక్ వీడియో తీసుకొచ్చి బీసీ ఎంపీపై కక్ష సాధిస్తారా?. చంద్రబాబు, ఎల్లో మీడియాది కుల దురహంకారం కాదా?’ అంటూ ఎంపీ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్
'ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా? అని ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. పట్టుబడిన రూ.50 లక్షల లంచం తనది కాదని చెప్పగలరా అని నిలదీశారు.చంద్రబాబు మనసూస్పర్తిగా కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తే.. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
చదవండి: (ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్)
Comments
Please login to add a commentAdd a comment