ధర్నాచౌక్‌ను తరలించొద్దు | indira park dharna cauk no changes | Sakshi
Sakshi News home page

ధర్నాచౌక్‌ను తరలించొద్దు

Published Wed, Mar 22 2017 3:37 AM | Last Updated on Mon, Jul 29 2019 7:38 PM

indira park dharna cauk no changes

సాక్షి, హైదరాబాద్‌: నిరసన తెలపడం ప్రజల కనీస ప్రజాస్వామిక హక్కని, దాన్ని కాల రాస్తే ప్రజాస్వామ్యానికి మనుగడే లేదని వామపక్ష, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ధర్నాచౌక్‌ సాధన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. నగరం నడిబొ డ్డునే ఉన్న ధర్నాచౌక్‌ తెలంగాణ ప్రజలకున్న నిరసన తెలిపే ఏకైక ధర్మగంటని, అది లేకుండా చేస్తే ప్రభుత్వానికే ప్రమాదకర మని.. తక్షణమే ధర్నాచౌక్‌ తరలింపును ఉపసంహరించుకోవాలని సదస్సు డిమాండ్‌ చేసింది.

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్య మానికి వేదికగా నిలిచిన ధర్నాచౌక్‌ను తరలించి, శాంతి భద్రతల పేరుతో ప్రజల స్వేచ్ఛను హరించరాదన్నారు. విద్యావేత్త చుక్కారామయ్య మాట్లాడుతూ ఇటు ప్రజల కు, అటు కేసీఆర్‌కు ధర్నాచౌక్‌ అవసరమేనని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, అంద రూ ఏదో ఒక సందర్భంలో ధర్నాచౌక్‌ను ఆశ్రయించక తప్పదని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా జరిగిన చరిత్రాత్మక పోరాటం మొదలుకొని తెలం గాణ ఉద్యమం వరకు ధర్నాచౌక్‌ వద్దే ప్రారం భమయ్యాయన్నారు. ఎమర్జెన్సీ పెట్టి ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాసిన ఇందిరమ్మకు 1977 ఎన్నికల్లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో గుర్తుపెట్టుకోవాలని జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు.

 డి.ఎల్‌ నర్సింగ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ నాయకులు సాది నేని వెంకటేశ్వరరావు, పోటు రంగారావు, పీఎల్‌.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ధర్నాచౌక్‌ తరలింపునకు నిరసనగా ఈ నెల 26న సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద 2కె రన్‌ నిర్వహిస్తున్నామన్నారు.  ఈ సందర్భంగా 21 మందితో ధర్నాచౌక్‌ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా చాడ, సభ్యు లుగా కోదండరాం, వరవరరావు, జీవన్‌ కుమార్, రామయ్య, గోవర్ధన్, విమలక్క, పోటు రంగారావు, గాదె ఇన్నయ్య, చెరుకు సుధాకర్, జస్టిస్‌ చంద్రకుమార్‌ తదితరు లను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement