
హన్మకొండ చౌరస్తా: కమీషన్ల కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టిందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ కొనుగోలుపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ‘రైతాంగ సమస్యలు– పరిష్కారాలు’ అనే అంశంపై టీజేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు.
రైతాంగ సమస్యలపై వచ్చే నెల 4న జరిగే చర్చలకు మాతో కలిసొచ్చే వారికి వివరిస్తామ న్నారు. ‘రైతు ఆత్మహత్యల నివారణ–లాభసాటి వ్యవసాయం’ నినాదంతో టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోదండరాం మాట్లాడారు. వ్యవసాయం వల్ల రూ.కోట్లలో లాభం వస్తుందని కొందరు పెద్దలు చెబుతుంటే, రాష్ట్రంలో మాత్రం రైతులు సాగును వదులుకునే పరిస్థితి నెలకొందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment