
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఇంటి పార్టీ సారథ్యంలో ఏ పదవిలో ఉన్నా పార్టీ పరంగా తాము అంగీకరిస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. సాంకేతికంగా లేదా ఇంకేమైనా అభ్యంతరాలున్నా పరిష్కరించుకుని అందరూ ఒకే పార్టీగా ప్రజల్లోకి వెళ్తే తెలంగాణ ఉద్యమ సామాజిక శక్తులు సంతో షిస్తాయన్నారు.
మంగళవారం పార్టీ కార్యాలయంలో హైకోర్టుకు చెందిన 25 మంది అడ్వొకేట్స్ జక్కుల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటి పార్టీలో చేరారు. కొత్తగా పార్టీలోకి చేరిన అడ్వొకేట్స్‌తో సెక్షన్ 506, 507లపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఓట్ల చీలికకు దారితీయకుండా కాంగ్రెస్‌తో కలసి ఉండే కూటమిలోకి రావాలని సుధాకర్ కోరారు.