
నల్లగొండ రూరల్: ప్రొఫెసర్ కోదండరాం జన సమితి పార్టీని ఎవరి కోసం పెట్టారని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. శనివారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కార్పొరేట్ సం స్థల నుంచి విరాళాలు తీసుకోమని ప్రకటించిన కోదండరాం సభ ఏర్పాట్లకు ఎక్కడి నుంచి నిధులు సమకూరాయని, జనసమితి వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ జనసమితితో కలసి పనిచేయక పోవ డానికి కోదండరాం నియంతృత్వ పోకడలే కారణమన్నారు. ఉద్యమ శక్తులు ఐక్యంగా ఉండాలని తాను పార్టీ ప్రకటించే రోజు గద్దర్, విమలక్క, చంద్రకుమార్‌లతో కలసి ముందుకు సాగానన్నారు. కేసీఆర్ తరహాలోనే కోదండరాం నియంతలా వ్యవహ రిస్తున్నారన్నారు. బీసీలకు పార్టీ కావాలని ఆర్.కృష్ణయ్య అనడంలో అర్థం లేదన్నారు.