సాక్షి, హైదరాబాద్ : బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, ఉద్యమకారుల గౌరవం కోసం తెలంగాణ ఇంటి పార్టీ పని చేస్తోందని ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. తెలంగాణ జనసమితి పార్టీలో తమ పార్టీ విలీనం కావడం లేదని, ఈ విషయంలో ప్రొఫెసర్ కోదండరాంతో జరిగిన చర్చలు సఫలీకృతం కాలేదని వెల్లడించారు. సోమవారం ఆదర్శ్‌నగర్‌లోని తెలంగాణ ఇంటి పార్టీ కార్యాలయంలో విలేకరులతో చెరుకు సుధాకర్ మాట్లాడారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా స్థాపించిన తెలంగాణ జనసమితిలో అటువంటి సిద్ధాంతాలు కనిపించలేదన్నారు. కోదండరాం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్లడం బాధాకరమన్నారు.
తెలంగాణ జన సమితిలో ఎస్సీ, ఎస్టీల వాటా ఎంత, ఉద్యమకారుల వాటా ఎంత అని స్పష్టంగా చెప్పకుండా కేసీఆర్ వ్యతిరేక కూటమి అంటూ చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ జనసమితిలో బడుగు బలహీన వర్గాలు, ఉద్యమకారులకు గౌరవం ఉండటం కోసమే తాను వర్కిం గ్ ప్రెసిడెంట్ పదవిని అడిగినట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కోదండరాం బృందం చర్చలు జరిపిందని, కోమటì æరెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండాలని కోరగా ఆయన తిరస్కరించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment