సర్కారు అవినీతిని ఎదిరిద్దాం
తెలంగాణ సర్కారులో అవినీతిని ఎదురిద్దామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
టీజేఏసీ చైర్మన్ కోదండరాం
సిరిసిల్ల: తెలంగాణ సర్కారులో అవినీతిని ఎదురిద్దామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మూడు రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన అమరుల స్ఫూర్తి యాత్ర ముగింపు బహిరంగ సభ సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సభలో కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ సర్కారు దూకుడుకు ముక్కుతాడు వేయాల్సిందేనన్నారు.
రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మిషన్ భగీరథను రూ.42 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం పెరిగిపోయిందని కోదండరాం అన్నారు. ఇసుకను దోపిడీ చేస్తున్నారని, సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు.