సర్కారు అవినీతి కంపుకొడుతోంది
- హైదరాబాద్ పరిసరాల్లో 10 వేల ఎకరాల కుంభకోణం: కోదండరాం
- కేకే పేరును ప్రభుత్వమే లీక్ చేయించిందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అవినీతితో కుళ్లి కంపుకొడుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయడం లేదని, ప్రభుత్వం లో ప్రజల భాగస్వామ్యం లేదని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. జేఏసీ రాష్ట్ర బాధ్యులు, జిల్లాల జేఏసీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. ‘‘బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఇలాంటి కుంభకోణాలు జరుగుతాయను కోలేదు.
అధికారం అప్పజెప్పింది ప్రజలకు మేలు చేయడానికి తప్ప దౌర్జన్యంగా భూములు రాయించుకోవడానికి కాదు. ఎక్క డ కాం ట్రాక్టర్లకు మేలు జరుగుతుందో అక్కడికే నిధులు వెళ్తున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లో కనీసం 10 వేల ఎకరాలు భూ కుంభకోణంలో ఉన్నాయి. ఈ అవినీతి వ్యవహారంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారి పేర్లను ప్రభుత్వమే బయటపెడు తోంది. ఎంపీ కేశవరావు పేరును ప్రభుత్వమే లీక్ చేయించింది’’ అని ఆయన అన్నారు. సమగ్ర చర్చ కోసం లాయర్ల జేఏసీతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.