సాక్షి, కరీంనగర్ : జనసేన పార్టీ నేత, హీరో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. పవన్ యాత్రపై ఆయనను స్పందన కోరగా పై విధంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులను పక్కకు నెట్టేసి ద్రోహులను తన దగ్గరకు చేర్చుకున్న ప్రభుత్వం గురించి ప్రజలకు అర్థమైందని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ చెప్పారు.
ప్రాంతీయ వనరులను సమకూర్చుకుని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నామని, కానీ కేసీఆర్ ప్రభుత్వ చర్యలు మాత్రం ఆంధ్రా వాళ్లకు లాభం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా టీజేఏసీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేసి రైతు సమస్యలపై అధ్యయనం చేశామని, జిల్లాల్లో సేకరించిన సమాచారాన్నంతా ఈ నెల (జనవరి) 31 లోగా క్రోడీకరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తామని కోదండరాం వెల్లడించారు.
'పవన్ గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకోలేను'
Published Tue, Jan 23 2018 6:25 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment