
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్
సాక్షి, కరీంనగర్ : కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. గురువారం కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడి కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సు ప్రమాదానికి ఆర్టీసీ అధికారుల పని ఒత్తిడి, ఓవర్ డ్యూటీనే కారణమని ఆరోపించారు. అంత పెద్ద సంస్థకు ఎండీ లేకపోవటం విచారకరమన్నారు. తక్షణమే ఐఏఎస్ లేదా ఐపీఎస్‌ను ఎండీగా నియమించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment