'బంగారు తెలంగాణలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలి' | Professor Kodandaram attends formation day celebrations in Melbourne | Sakshi
Sakshi News home page

'బంగారు తెలంగాణలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలి'

Published Sun, Jun 12 2016 5:57 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

Professor Kodandaram attends formation day celebrations in Melbourne

- మెల్‌బోర్న్‌లో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్

రాయికల్ (కరీంనగర్ జిల్లా) : బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణవాదులు, ఎన్‌ఆర్‌ఐలు సైతం ఉద్యమానికి మద్దతిచ్చారన్నారు.

బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి అనిల్, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement