
'తెలంగాణ వచ్చినా సమస్యలు ఉన్నాయి'
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదంరామ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు.
టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు .ప్రజాపోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని, ఆ విషయాన్ని మర్చిపోద్దని చెప్పారు. ఓయూ భూముల వ్యవహారాన్ని జేఏసీ సమావేశంలో చర్చించలేదని చెప్పారు.