telangana political JAC
-
లబ్ధికోసమే బీఆర్ఎస్ నీటి రాజకీయం : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేతిలో భంగపడ్డ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలు, రైతులను మోసగించి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకే ‘నీళ్ల’ రాజకీయం చేస్తున్నారని రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్‌సింగ్‌తో కలిసి మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేళ్లలో రైతులను ఏనాడూ పట్టించుకోని కేసీఆర్‌కు ఇప్పుడు వారి కష్టాలు గుర్తుకొచ్చాయని మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అయినా రైతులు ఆయనను నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ అఽధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాలనలో చేసిన మోసాలు, పాపాలు బయటకు వస్తున్నాయని, వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం.. వ్యవసాయ రంగంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని, అలాగే పాలకుర్తి మండలంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలన్నీ పక్కాగా అమలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 35కోట్ల మంది అక్కాచెల్లెళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగించారని అన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అర్హులందరికీ అందిస్తామని తెలిపారు. సాంకేతిక కారణాలతో పొరపాట్లు దొర్లినా ఇబ్బంది పడొద్దని, వారి నుంచి విద్యుత్ అధికారులు బిల్లులు వసూలు చేయరాదని సూచించారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15కోట్ల విలువైన వైద్యసేవలు అందించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిన బీఆర్ఎస్ పాలకుల తప్పిదాలను గాడిన పెట్టేందుకే సమయం పడుతోందని తెలిపారు. సమావేశంలో నాయకులు శంకర్, రమేశ్‌గౌడ్, సారయ్య, ప్రకాశ్‌రావు, మహేందర్, సంపత్, మల్లయ్య, శ్రీనివాస్, మస్రత్, కుమార్, ఈర్ల స్వరూప, కుమారస్వామి, అక్బర్అలీ పాల్గొన్నారు. ఇవి చదవండి: దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి -
జిల్లాల విభజన అశాస్త్రీయం: కోదండరాం
గుండాల: జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని.. నీకో జిల్లా, నాకో జిల్లా అని రాజులు పంచుకున్న సామ్రాజ్యంలా విభజన చేశారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ప్రజా భీష్టం మేరకే మండలాలు, జిల్లాల విభజన జరుగుతుందని ప్రగల్భాలు పలికిన పాలకులు.. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రిలో కలపాలని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రెండు నెలలుగా సాగుతున్న ఆందోళనలో భాగంగా గుండాలలో బుధవారం మిలీనియం మార్చ్ జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం 60 ఏళ్లుగా పోరాటం చేసి తెలంగాణను సాధించుకుంటే.. పాలకులు బంగారు తెలంగాణగా మారుస్తామని భ్రష్టుపట్టించారని అన్నారు. సబ్బండ జాతి ఏకమై ఉద్యమిస్తే ప్రజాభీష్టాన్ని పట్టించు కోని పాలకులు సన్నాసుల్లో కలుస్తారని ఆయన ఆవేశ పూరితంగా అన్నారు. -
'తెలంగాణ వచ్చినా సమస్యలు ఉన్నాయి'
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదంరామ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు .ప్రజాపోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని, ఆ విషయాన్ని మర్చిపోద్దని చెప్పారు. ఓయూ భూముల వ్యవహారాన్ని జేఏసీ సమావేశంలో చర్చించలేదని చెప్పారు. -
'పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది'
-
ఇంకా ఆర్టీసీని విభజించకపోతే ఎలా?: కోదండరామ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతను విడనాడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తక్షణమే ఆర్టీసీని విభజించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ విడిపోయినప్పటికీ ఆర్టీసీని ఎందుకు విభజించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్ సమీపంలోని బస్ భవన్ నుంచి ఇందిరాపార్కు వరకూ భారీ ర్యాలీ, అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ నిజాం కాలంనుంచే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ సంస్థకు చెందిన స్థిరాస్తుల్లో ఏపీ ప్రభుత్వం వాటా అడగడం అన్యాయమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీలో నియామకమైన ఏపీ అధికారులకు తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే తెలంగాణ ఇంక్రిమెంట్లను ఆర్టీసీ కార్మికులకు సైతం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్ కె. రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఆర్టీసీని వెంటనే విభజించి, తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జేఏసీ చైర్మన్ నరేందర్, కో చైర్మన్ అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లా బంద్
టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ మద్దతు నల్లగొండ : ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ శనివారం జిల్లాబంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ మద్దతు ప్రకటించాయి. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, టీఆర్ఎస్ యువజన విభాగాలు సైతం బంద్‌లో పాల్గొనున్నట్లు వేర్వేరు పత్రిక ప్రకటనలు జారీ చేశాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురయ్యే మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆమోదించిన బిల్లును ఉపసంహరించుకోవాలని వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలో నల్లగొండలో క్లాక్‌టవర్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపి కేంద్రం చట్టం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆంధ్ర సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రలోభాలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందన్నారు. మూడు లక్షల మంది గిరిజనుల హక్కులను కాలరాస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. -
ఇంకెందుకు రాజకీయ పంచన?
అన్ని జేఏసీలను ఏకం చేసేందుకు కోదండరాం సిద్ధమేనా? తెలంగాణ రాష్ట్ర సాధన ఎవరి విజయం? అడుగడుగున ఊపిరులూదిన ఉత్పత్తి శక్తులదా? ఆ శక్తుల త్యాగాలపైనే ఏర్పడ్డ పార్లమెంటరీ వ్యవస్థదా? ఈ ప్రశ్నకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచణ నేత లు జవాబు చెప్పాలి. కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థుల వల్లే తెలంగాణ సాధ్యమనే నిజాన్ని ఒప్పుకుంటే... తెలంగాణ రాజకీయ జేఏసీృఇప్పుడు ఆ వర్గాలకే పరిమితమవ్వాలి. ఆ ఆలోచన ప్రొఫెసర్ కోదండరాంకు ఉందా? అన్ని ఐక్య కార్యాచణలను ఏకం చేసేందుకు సిద్ధమేనా? జనం కోరుకున్న తెలంగాణ పునర్ నిర్మాణానికి ఆయన అడుగులేస్తారా? ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వేదకుమార్ వేస్తున్న ప్రశ్నలివి. తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది చనిపోవడం దురదృష్టకరమే. దీనికి రాజకీయ జేఏసీనే కారణం. వాళ్ళ నాయకత్వమే పొట్టనబెట్టుకుంది. రాష్ట్ర సాధన కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కో అగ్ని కణమై లేచారు. ఎక్కడికక్కడ జేఎసీలుగా ఏర్పడ్డారు. వీటన్నింటికీ నాయకత్వం వహించేందుకు తెలంగాణ ఐక్య కార్యాచణ కమిటి ముందుకొచ్చింది. కానీ ఆ తర్వాత రాజకీయ పార్టీల పంచన చేరింది. అవకాశ ధోరణితో పార్టీలు అవసరమైనప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపాయి. అవసరం లేనప్పుడు నీరుగార్చాయి. ఈ నైరాశ్యం నుంచే ఆత్మహత్యలు జరిగాయి. ఆశించినంత పాత్ర లేదు ... టీజేఏసీ అనుకున్న మేర ముందుకెళ్ళలేదు. ఆంక్షల తెలంగాణ ఎవరు కోరుకున్నారు? పోలవరం ప్యాకేజీ, ముంపు గ్రామాల బదలాయింపు, పదేళ్ళ ఉమ్మడి రాజధాని, గవర్నర్ చేతికి హైదరాబాద్‌పై అధికారం... ఇవన్నీ ఆంక్షలు కావా? జేఏసీ ఏం చేసింది? సొంత ఎజెండాతో ఎందుకు ముందుకెళ్ళలేదు? ఇప్పుడీ విజయం ఎవరిది? ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. సాకారమైన తెలంగాణను రాజకీయ పార్టీలు గుప్పిట్లోకి తీసుకుంటున్నాయి. రాష్ట్ర సాధన కోసం నిరంతర పోరు చేసిన ఉత్పత్తి శక్తులు (కవులు, కళాకారులు, ఉద్యోగులు,విద్యార్థులు, రచయితలు, మేధావులు) వెనక్కు తగ్గాయి. అప్పట్లో అని వార్యమై రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలు మద్ధతునిచ్చాయి. ఉద్యమాలతో పాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే తెలంగాణ సాధ్యమని ఆనాడు భావించాయి. దీన్ని పార్టీలు హైజాక్ చేశాయి. ఉద్యమ శక్తుల త్యాగాలకు గుర్తింపు లేకుండా చేస్తున్నాయి. ఉద్యమ శక్తులు శాసిస్తాయి... ఉద్యమశక్తులు పాలించకపోయినా..శాసిస్తాయి. ప్రజలు, ప్రజా సంఘాలిచ్చే సూచనలే జనం మెచ్చేవిగా ఉంటాయి. రాజకీయ జేఏసీ అయినా ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకుంటుందా? ఇప్పటికైనా కోదండరాం పార్టీల పంచ నుంచి బయటపడాలి. ప్రజా ఉద్యమ సంఘాల చెంతకు రావాలి. యువరక్తం నాయకత్వం వహించాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పుడున్న పార్లమెంటరీ శక్తులపై ప్రజలకు విశ్వాసం లేదు. 44 ఏళ్లలో తెలంగాణ ఎంత దోపిడీకి గురైందో.. ఈ 13 ఏళ్ళలోనూ ఆదే స్థాయిలో దోపిడీ కొనసాగింది. ప్రజా సంఘాలు మద్దతిచ్చి ఎన్నుకున్న పార్టీల చరిత్ర ఇది. వీళ్ళే మళ్ళీ అధికారందక్కించుకునేందుకు ముందుకొస్తున్నారు. డబ్బుతో సీట్ల జూదం ఆడుతున్నారు. ప్రజలు చాలా కోరుకుంటున్నారు. నిజానికి ఆ ఆశలు మనమే కల్పించాం. నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని చెప్పాం. హరిజన, గిరిజన అభ్యున్నతికి బాటలు వేస్తామన్నాం. కేంద్రంలో ఎవరు వస్తారో చూసుకుని ప్రణాళికలు తయారు చేస్తే తెలంగాణ ఆశలు ఎలా నెరవేరుతాయి? పోలవరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణకు అవసరం లేదు. గ్రామీణ జీవన విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చేతి వృత్తులను ప్రోత్సహించాలి. ఇక మీదట హైదరాబాద్ జనాభా పెరిగితే ప్రమాదమే. దీన్ని నివారించాలంటే ముందు గా పట్టణీకరణ ఆపాలి. గ్రామాల్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతం ఇవ్వాలి. ఎక్కడ ఏ పరిశ్రమలు కావాలో ప్రజలే నిర్ణయించాలి. ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ వైద్యశాలలకు మెరుగైన వసతులు కల్పించాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో ఇది సాధ్యం కాదు. మరెలా? తెలంగాణ వచ్చిందని, ఇక తమ పనిలేదని నిద్రాణ స్థితిలో ఉన్న మేధావి వర్గం కళ్ళు తెరవాలి. సాకారమైన తెలంగాణను జనాభీష్టం మేరకు తయారు చేసే ఉద్యమ కేంద్రాలు కావాలి. పార్టీల మెడలు వంచి ప్రజల మేనిఫెస్టో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా ప్రజా సంఘాలు జాగృతం కావాలని కోరుకుందాం. జన తెలంగాణ మాట మీద నిలబడే నేత కావాలి... ఇచ్చిన మాట మీద నిలబడే నాయకున్ని ఎన్నుకోవడమే ఓటర్ల ప్రధాన బాధ్యత. తెలంగాణ నవ నిర్మాణంలో యువత ప్రధాన పాత్ర పోషించాలి. ఇరుప్రాంతాలను అభివృద్ది చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. ఆయన మాత్రమే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సువర్ణయుగాన్ని తేగలరు. ఆరోగ్యశ్రీ, అమ్మఒడి లాంటి పథకాలు రెండు రాష్ట్రాల్లో అమలు కావాలి. - చింతకింది శ్రీహరి మన్‌పహాడ్, దేవరుప్పుల మండలం, వరంగల్ జిల్లా పరిశ్రమలకు టాక్స్ హాలిడే ఇవ్వాలి.. తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పదేళ్లపాటు పరిశ్రమలకు టాక్స్ హాలిడే ప్రకటించాలి. నిరుద్యోగులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించాలి. ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలి. దీనివల్ల విద్యుత్ సంక్షోభం తీరడంతో పాటు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యవసాయానికి రాజశేఖర్‌రెడ్డి తరహాలో ప్రోత్సాహం కల్పించాలి. గోదావరి తీరంలో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయాలి. చిత విద్యుత్ కొనసాగించాలి. పర్యాటక, దేవాదాయ శాఖల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశాలున్నాయి. సమసమాజ లక్ష్యంగా ప్రజలు కలలు గన్న తెలంగాణ నిర్మాణం జరగాలి. - వసంతరాయ్ తోట, రెడ్డి కాలనీ, మిర్యాలగూడ వనరుల సద్వినియోగం... సంపదను సక్రమంగా వినియోగించే సమర్థులు అధికారంలోకి రావాలి. అవినీతి, స్వార్థం లేని నాయకుల వల్లనే ఇది సాధ్యం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రవాణా సౌకర్యా లను మెరుగుపర్చాలి. తెలంగాణ మరిం త వేగంగా అభివృద్ధి జరగాలంటే రవా ణా సదుపాయాలు పెరగాలి. ప్రధానం గా రైలుమార్గాల విస్తరణకు కృషి చేయా లి. వ్యవసాయంతో పాటు పాడి పరి శ్రమ అభివృద్ధిమీద దృష్టి సారించాలి. నిర్భంద విద్యను అమలుచేసి పదేళ్లలో నిరక్షరాస్యులు లేని రాష్ట్రంగా తయారు చేయాలి. నైజాం ఆభరణాలను అమ్మి బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఖర్చుచేయాలి. - మంద నారాయణమూర్తి, హైదరాబాద్ -
హైదరాబాద్‌లోనే చిత్ర పరిశ్రమ విస్తృతి
‘జై బోలో తెలంగాణ’ అభినందన సభలో వక్తల భరోసా సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌లోనే మరింత విస్తరించేలా, అది ఇక్కడి నుంచి వీడి వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకునే బాధ్యత భవిష్యత్ తెలంగాణ రాజకీయ నాయకత్వం మీదనే ఉందని టీఆర్ఎస్ నాయకుడు కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘జై బోలో తెలంగాణ’ చిత్రం యూనిట్ సభ్యులు సోమవారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల నమూనా స్తూపం వద్ద అతిథులు శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘కళామతల్లికి ప్రాంతీయ, భాషా బేధాలు ఉండవు. సినిమా ఒక మార్మిక కళారూపం. అమరుల త్యాగం, కవులు, కళాకారుల అవిశ్రాంత పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. భవిష్యత్తులో ఇరు ప్రాంతాల ప్రజలు సమన్వయంతో భాగ్యవంతమైన తెలుగుజాతిని నిర్మించాలి’’ అని ప్రజా గాయకుడు గద్దర్ అభిలషించారు. చిత్ర పరిశ్రమలో నాలుగైదు కుటుంబాలే గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయని, ఇదే ధోరణి కొనసాగితే పరిశ్రమ నుంచి మరో ఉద్యమం పుట్టడం ఖాయమని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె.ఎస్.రామారావు అల్లం నారాయణ, పాశం యాదగిరి, విజేందర్‌రెడ్డి, కె.శ్రీనివాస్, రసమయి బాలకిషన్, విమలక్క, దేవీప్రసాద్, విఠల్, నందిని సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విభజన బిల్లు ఆమోదంపై నేతల భిన్నాభిప్రాయాలు
అమరులకు అంకితం: కోదండరాం సాక్షి, న్యూఢిల్లీ: అనేక పరిస్థితుల మధ్య తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని, బిల్లు ఆమోదించడంపై సంతోషకరమని తెలంగాణ రాజ కీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ విజయం ప్రాణత్యాగాలు చేసుకున్న అమరవీరులకే అంకితమని స్పష్టం చేశారు. రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందాలన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది ప్రజా విజయం. చెప్పరానంత సంతోషంగా ఉంది. ప్రాంతాలుగా విడిపోతున్నాం.. కానీ ఆంధ్ర ప్రాంత ప్రజల తో సోదర భావంతో ఉంటాం. యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీకి, మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నాం. తెలంగాణకోసం కేసీఆర్ ఎంతో కృషిచేశారు. ఆయన మాలో భాగం కాబట్టి కృతజ్ఞతలు అని చెప్పడంలేదు’’ అని చెప్పారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డికి, ఇతర నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. సీమాంధ్రను గుజరాత్‌లా తీర్చిదిద్దుతాం రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన సమయంలో ఇరుప్రాంత ప్రజలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. విభజన పూర్తయిన తర్వాత ఇరు ప్రాంతాలకు రానున్న రోజుల్లో బీజేపీ న్యాయం చేస్తుంది. సీమాంధ్రను గుజరాత్‌లా తీర్చిదిద్దుతాం. కేవలం మా మద్దతు కారణంగానే తెలంగాణ ఏర్పడబోతోంది - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సహజసిద్ధంగానే వచ్చింది రాష్ట్రపునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభ ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ ఏర్పాటు యాదృచ్ఛికమో, అప్రజాస్వామికంగానో వచ్చింది కాదు. అభివృద్ధి నినాదంతో మొదలైన ఉద్యమం రాజకీయ నినాదంగా మారింది. రాష్ట్రం ఏ ఒక్క పార్టీతోనో రాలేదు. సహజసిద్ధంగానే ఏర్పాటైంది. ఇది కచ్చితంగా రాజకీయ నిర్ణయమే - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, రాంనరసింహారావు క్రెడిట్ అమరవీరులదే బిల్లు ఆమోదం క్రెడిట్ అంతా తెలంగాణ అమరులదే. ఈ విజయంలో టీఆర్ఎస్, బీజేపీ కృషి మరువలేనిది. వారికి ధన్యవాదాలు. కొన్ని రోజులుగా తెలంగాణ ఏర్పాటుపై అనేక సందేహాలున్నా చివరికి కల నిజమైంది. తెలంగాణ కోసం నేనూ, కేసీఆర్ తీవ్రంగా కష్టపడ్డాం. చివరకు సాధించాం. తెలంగాణకు మంచి విజన్ ఉన్న సీఎం అవసరం - ఎంపీ విజయశాంతి సోనియాగాంధీ కృషితోనే.. సోనియాగాంధీ కృషి వల్ల తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల నెరవేరింది. బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు చెబుతున్నా. -పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి జేజేలు శాంతి, సహనం, చైతన్యం, పోరాటం, ముఖ్యంగా అమరుల త్యాగాలతో సిద్దించిన తెలంగాణ రాష్ట్రానికి జేజేలు. అమరులకు జోహార్లు. రాష్ట్రాలుగా విడిపోయినా.. మానవ సంబంధాలు పెంచుకుంటూ.. తెలుగుజాతి ఒక్కటిగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ - డెరైక్టర్ ఎన్. శంకర్ సోనియాకు గుణపాఠం చెప్పాలి సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి, పూర్తి స్థాయిలో చర్చ జరపకుండా, ఓటింగ్ నిర్వహించకుండా కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై విభజన బిల్లును ఆమోదించడం దుర్మార్గపు చర్య. బీజేపీ.. మాట మార్చి బిల్లుకు ఆమోదం తెలపడం సిగ్గుచేటు. తెలుగు జాతి బీజేపీని క్షమించదు. నియంతగా వ్యవహరించిన సోనియాకు తగిన గుణపాఠం చెప్పేరోజు దగ్గర్లోనే ఉంది. కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గపు చర్యలకు నిరసనగా బుధవారం బంద్‌ను జయప్రదం చేయాలి.- ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి -
బిల్లుపై వెనుకడుగువేస్తే పునాదులుండవు
న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో తాము కోరుతున్న మార్పులు చేర్పులు చేసి ఆంక్షలులేని సంపూర్ణ తెలంగాణను కేంద్ర కేబినెట్ ఆమోదించాలని కోరుతూ తెలంగాణ జేఏసీ నేతలు శుక్రవారం ఏపీభవన్‌లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్ష చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ బిల్లుపై వెనుకడుగువేసే పార్టీల పునాదులు ఉండవని హెచ్చరించారు. కేబినెట్ సమావేశానికి రెండుగంటల ముందు దీక్షకు దిగిన నేతలు హైదరాబాద్‌పై ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరే తెలంగాణకు అన్ని అధికారాలు ఇవ్వాలని కోరారు. వీటితోపాటే భద్రచాలం డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలని, అవసరమైతే పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. జేఏసీ ఛైర్మన్ కోదండరాం, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ల నేతృత్వంలో జరిగిన ఈ దీక్షలో విఠల్, రఘు, అద్దంకి దయాకర్, మల్లేపల్లి లక్ష్మయ్యతో పాటు ఓయూ జేఏసీ నేతలు పున్నా కైలాశ్, జగన్, రమేశ్‌లు, పెద్ద సంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యాంశాలు... * మెజారిటీ పార్టీలు వ్యతిరేకించినా అమెరికాతో అణుఒప్పందాన్ని ఆమోదించినట్టుగానే ప్రభుత్వం తెలంగాణ బిల్లును ఆమోదింపచేసుకోవాలి. * డబ్బు, అహంకారంతోనే సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. * విభజన విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా సీమాంధ్రనేతల వైఖరి మారకపోవడం దారుణం. -
హస్తినలో టీ జేఏసీ భేటీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, జేఏసీ ముఖ్యనేతలు పలువురితో కలిసి బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జానారెడ్డిలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, మల్లేపల్లి లక్ష్మయ్య, రాజేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు కోదండరాం వెంట ఉన్నారు. గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు కేసీఆర్‌తో కలసి జేఏసీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశం కానున్నారు. -
మా చిత్తశుద్ధిని శంకించొద్దు
* టీ జేఏసీకి రాష్ట్ర బీజేపీ నేతల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని టీజేఏసీని బీజేపీ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేసింది. టి.బిల్లును రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించడం, సీఎం కిరణ్ దీక్ష చేస్తాననడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లును పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారంటూ తమ పార్టీ నాయకురాలు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ చేసిన వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందని వివరణ ఇచ్చారు. మంగళవారం ఇక్కడ జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం సందర్భంగా సుష్మ మీడియాతో మాట్లాడిన దృశ్యాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. మీడియా వక్రీకరణను నమ్మడం లేదని ప్రకటించాల్సిందిగా జేఏసీ నేతల్ని ప్రత్యేకించి కోదండరాంను బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నేత డాక్టర్ టి.రాజేశ్వరరావు పదేపదే కోరారు. దీంతో కోదండరాం స్పందిస్తూ ‘తెలంగాణకు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, ఆర్ఎల్డీ సహా అనేక పార్టీలు మద్దతిస్తున్నాయి. తెలంగాణకు అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. తెలంగాణవాదులకు అనుమానాలు వద్దు. మాకూ అనుమానాలు లేవు. ఉద్యమంలో ఇట్లాంటివి మామూలే. ఇది కొత్తాకాదు, చివరిసారీ కాదు’ అని వ్యాఖ్యానించారు. -
‘ఆధార్ లింకేజీ వద్దు’
హైదరాబాద్, న్యూస్‌లైన్: పేద విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ రాజకీయ జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఆధార్ లింకేజీని ప్రభుత్వం ముడిపెట్టిందని శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో వారు విమర్శించారు. అనం తరం స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని, రీయిం బర్స్‌మెంట్‌కు ఆధార్ లింకేజీని తొలగిం చాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ విద్యార్థులు చలో అసెంబ్లీ చేపట్టారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. -
'హైదరాబాద్‌లో పాగా వేస్తామన్న వారిని పాతరేస్తాం'
మహబూబ్‌నగర్: భోగి మంటల్లో తెలంగాణ బిల్లు ప్రతులు దగ్దం చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్టేనని తెలంగాణ రాజకీయ జేఏసీ కో- ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విభజనను భోగి మంటల్లో దగ్ధం చేసిన ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర నేతలపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పాగా వేస్తామన్న సీమాంధ్ర నేతలను పాతరేస్తామని ఆయన హెచ్చరించారు. 90 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. - సీమాంధ్రుల కబంధహస్తాల్లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేవరకు పోరాటం కొనసాగుతుందని అతంకుముందు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణను అడ్డుకునే శక్తుల జాబితాను తయారుచేస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత వారి భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చ మొదలైందని, అల్లరిచేస్తూ చర్చ జరగకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. -
తెలంగాణ పునర్నిర్మాణంలో వ్యవసాయమే కీలకం : కోదండరాం
హైదరాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వ్యవసాయమే కీలకమని, ఆ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రధాన భూమిక పోషించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. ‘తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం-వ్యవసాయ విశ్వవిద్యాలయం పాత్ర’ అనే అంశంపై శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించే ముందు 1956 కంటే ముందుగల ఆస్తులు, వనరులను తెలంగాణకు ప్రకటించాలని, ఉమ్మడిగా అయిన ఖర్చును జనాభా ప్రాతిపదికన పంచాలని అన్నారు. తెలంగాణలో నీరులేక వ్యవసాయం వెనకబడిపోయిందని, నదీజలాల పంపిణీలో ట్రిబ్యునల్ సూచించిన మేరకు వాటాను పంచాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించడంలో రైతాంగానికి ఏజీ వర్సిటీ మార్గదర్శకంగా ఉండాలని కోరారు. సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పరిశోధన, శాస్త్ర పరిజ్ఞానం అందినప్పుడే తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణలోని వ్యవసాయ సంక్షోభాన్ని రూపుమాపడానికి, విప్లవాత్మక మార్పులు తేవడానికి ఏజీ వర్సిటీ వేదికగా మారాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎంపీ వివేక్, టీఎన్జీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ కూడా మాట్లాడారు. -
నేడు తెలంగాణ జేఏసీ సమావేశం
-
నేడు తెలంగాణ పొలిటికల్ జేఏసీ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేడు సమావేశం కానుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు త్వరితగతిన పూర్తిచేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరు కానున్నారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో భారీ సభతో పాటు ఢిల్లీ యాత్రపై కూడా ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న తీరుపై జేఏసీ నేతలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలంటూ వస్తున్న ఆందోళనల నేపధ్యంలో జేఏసీ కీలక ప్రకటన చేయనుంది. -
పోలీసుల చర్యలను ఖండించిన కోదండరామ్
హైదరాబాద్ : నిజాం కళాశాల అతిథిగృహంలో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఖండించారు. పోలీసుల చర్యలు దారుణంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా నిజాం కళాశాలలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించారు. పోలీసుల తీరుపై కళాశాల ప్రిన్సిపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఈరోజు ఉదయం నిజాం కళాశాల హాస్టల్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాన్ బోర్డర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చీమ చిటుక్కుమనొద్దు: టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ బంద్ పిలుపు సందర్భంగా హైదరాబాద్‌లో చీమ చిటుక్కుమనకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఇన్‌చార్జీలతో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ ముఖ్యనేతలు నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు, కె.స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ సమావేశమయ్యారు. బంద్ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా, క్రియాశీలంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు సాకారమవుతున్న ఈ కీలక సమయంలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయని పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ సమయంలో హింస జరిగితే తెలంగాణ ఏర్పాటుపై ప్రతికూల ప్రచారం జరిగే అవకాశముందన్నారు. విధ్వంసాలు, హింసకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా బంద్‌ను, సంపూర్ణంగా నిర్వహించడానికి టీఆర్ఎస్ పెద్దన్న పాత్రను పోషించాలని ఇన్‌చార్జీలకు పార్టీ నేతలు సూచించారు. ఏం జరిగినా సీఎందే బాధ్యత: నాయిని నర్సింహారెడ్డి ఏపీఎన్జీఓ సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరిగినా ముఖ్యమంత్రి కిరణ్‌దే బాధ్యతని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. తెలంగాణ సభలకు అనుమతినివ్వకుండా, తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న సభకు సీఎం, డీజీపీ అనుమతినిచ్చినందుకు నిరసనగా తెలంగాణ బంద్‌ను నిర్వహిస్తున్నామని వివరించారు. ఎల్బీ స్టేడియం నిండిపోయిన తర్వాత బయట ఏమైనా సమస్యలు తలెత్తినా, రెచ్చగొట్టే చర్యలకు దిగి ఏమైనా జరిగితే సీఎం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని నాయిని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు దాసోజు శ్రవణ్ అన్నారు. బంద్ వ్యూహంపై జీహెచ్ఎంసీ పార్టీ ఇన్‌చార్జీలతో వ్యూహంపై చర్చించామని శ్రవణ్ వివరించారు. తెలంగాణకు హక్కులే లేవా...? : ఈటెల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించే సభలపై ఆంక్షలు విధిస్తూ, తెలంగాణను వ్యతిరేకించే సభలకు హైదరాబాద్‌లోనే అనుమతిస్తూ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ విమర్శించారు. ఆయున శుక్రవారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు హక్కుల్లేవా?, తెలంగాణ ప్రజలవి జీవితాలే కావా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణ గడ్డమీద పెట్టుకునే సభకు తావుు వ్యతిరేకమేనని ప్రకటించారు. శాంతిర్యాలీకి అనుమతి ఇవ్వనందకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. -
మళ్లీ ఉత్కంఠకు తెరలేచింది
సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన ఇ ‘‘సేవ్ ఆంధ్రప్రదేశ్’’ పేరిట ఏపీ ఎన్జీఓల సంఘం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభ నేపథ్యంలో తెలంగాణ జేఏసీ నాయకత్వం బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్ర రాజధానికి ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు చే అదే మాదిరిగా మాచర్ల నుంచి నాగార్జునసాగర్ మీదుగా రావాల న్నా జిల్లా గుండా ప్రయాణించాల్సిందే. పిడుగురాళ్ల, దాచేపల్లి మా సీమ జిల్లాలు మినహాయిస్తే ఆంధ్రా ప్రాంతంలోని ఏ జిల్లా నుంచి అయినా హైదరాబాద్‌కు రావాలంటే నల్లగొండ జిల్లా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణవాదులు తమ దృష్టిని జాతీయ రహదారిపైనే పెట్టారు. ఈ కోణం నుంచి ఆలోచించిన పోలీసు అధికా ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోదాడ మండలం నల్లబండగూడెం పాలే జాతీయ రహదారిపై ప్రతి మండల కేంద్రంతో పాటు, మధ్య మధ్యా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు ఏపీ ఎన్జీఓల సభకు ప్రుత్వమే అనుమతి ఇచ్చినందున, ఆ సభకు వెళ్లే వారిని సు గతంలో తెలంగాణవాదులు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు వెళ్లడాన్ని పూర్తిస్థాయిలో అడ్డుకున్న పోలీసులు ఈసారి దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జేఏసీ నాయకత్వం విమర్శించింది. ప్రభుత్వ అనుమతి ఉన్న సభలకూ హాజ రోడ్లమీద ఒక్క వాహనాన్ని కదలనీయవద్దన్న పట్టుదలతో తెలంగాణవాదులు ఉండగా, ఎట్టి పరిస్థితుల్లో బంద్‌ను విజయవంతం కానీయవద్దని, ఆంధ్రా వాహనాలను సురక్షితంగా హైదరాబాద్ చేరేలా చూడాలని పోలీసులు ప్రయత్నిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సకల జనుల సమ్మె సంద ఈసారి ఆ పరిస్థితిని ఉత్పన్నం కానీయకూడదన్న వ్యూహంతో పోలీసులు ఉన్నారు. కాగా, జిల్లాలో శనివా ఆయా విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలు జరిపారు. తెల్లవా పోలీసు ఉన్నతాధికారుల పర్యటన తెలంగాణకు ప్రవేశం ద్వారమైన కోదాడ మండలం నల్లబండ గూడెం పాలేరు వంతెన సరిహద్దుపై పోలీసులు దృష్టి పెట్టారు. పాలే శుక్రవారం హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్‌చంద్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు సరిహద్దు ప్రాంతానికి వచ్చి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. సూర్యాపేట డీఎస్పీ, కోదాడ కోదాడ పట్టణ బైపాస్‌రోడ్డు వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
విభజనతో..అంతటా అభివృద్ధి
సూర్యాపేట, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ప్రజాస్వామికీకరణ జరుగుతుందని, మూడు ప్రాంతాల్లో కొత్త అభివృద్ధికి అవకాశం కలుగుతుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మూడు ప్రాంతాల ఉద్యమ నేతల ఉమ్మడి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 1990 దశకంలో అంతర్జాతీయ పెట్టుబడులు తేవాలనే ప్రయత్నంలో మురికివాడలను తొలగిం చడం, రైతుల భూములు గుంజుకోవడం, చెరువులు పూడ్చివేయడం చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఐటీ, ఇతర రంగాల్లో కంపెనీలు పేరిట భూముల విలువలు విచ్చలవిడిగా పెంచుకున్నారని, ఇది రియల్ ఎస్టేట్ ప్రేరిత అభివృద్ధి తప్ప మరోటి కాదన్నారు. న్యాయం, స్వేచ్ఛ సమానత్వం కోసం జరిగిందే తెలంగాణ పోరాటమన్నారు. సమైక్య ఉద్యమం యాసిడ్ దాడి చేసే ప్రేమోన్మాదం లాంటిదని విమర్శించారు. సమైక్యాంధ్ర.. బూటకం, కమ్మ, రెడ్డిల నాటకం : పల్నాటి శ్రీరాములు సమైక్యాంధ్ర బూటకం.. కమ్మ, రెడ్డిల నాటకమని బహుజనాంధ్ర ఉద్యమ నేత పల్నాటి శ్రీరాములు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రలో ఉద్యమం చేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు సమైక్య పదం ఉచ్ఛరించడానికి అర్హత లేదన్నారు. ఏనాడైనా దళిత బహుజనులను కలుపుకునిపోయారా అని ప్రశ్నించారు. నిజమైన సమైక్యత ఉంటే సీమాంధ్ర, తెలంగాణలో రెండు కులాల చేతుల్లోనే పరిపాలన ఎందుకుంటుందని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర పాలనలో దళిత బహుజనులకు జీవించే హక్కు కాలరాశారని, అందుకు ఉదాహరణే కారంచేడు, చుండూరు మారణహోమాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక మనస్తత్వంతో ప్రజలంతా కదం తొక్కడం చాలా సంతోషకరమన్నారు. పెట్టుబడులు, ఆధిపత్యం కాపాడుకోవడం కోసం సమైకాంధ్ర ఉద్యమం నిర్వహిస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు, కార్పొరేట్ విద్యార్థులు తప్ప ఉద్యమంలో ప్రజలు లేరన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే సమైకాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారన్నారు . రాయలసీమ, సర్కారాంధ్ర కలిసి ఉండడం అసంభవం : డాక్టర్ భూమన్ తెలంగాణ వేరైతే రాయలసీమ, సర్కారాంధ్ర కలిసి ఉండడం అసంభవమని రాయలసీమ అధ్యయన వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ భూమన్ అన్నారు. సర్కారాంధ్రలో 112, రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏ తీర్మానం పెట్టినా తాము నెగ్గేదెలా అని ప్రశ్నించారు. మూడు ముక్కలాట.. మూడు రాష్ట్రాల మాట అని తాము ఆశామాషిగా మాట్లాడడం లేదని పేర్కొన్నారు. 1913 నుంచే తాము ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుతున్నామని గుర్తు చేశారు. మీ రాష్ట్రం మీకేర్పడితే మిగలబోయేది మా సమస్యలు, మా కన్నీళ్లేనని, మా పట్ల ఓ కన్నేయండని తెలంగాణ ప్రజలను కోరారు. రాయలసీమ రతనాల సీమా, రత్నగర్భ, అపారమైన ఖనిజ సంపద ఉన్న ప్రాంతమన్నారు. వైశాల్యం రీత్యా 10 జిల్లాలతో కూడిన రాష్ట్రమవుతుందన్నారు. మీకు బొగ్గు గనులు ఉంటే.. మాకు ఎర్రచందనం, ముగ్గు రాళ్లు, ఆస్బేస్టాస్లాంటి సంపద ఉందన్నారు. కేవలం ఫ్యాక్షనిజం వల్లే అక్కడ పరిశ్రమలు పెట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రెవెన్యూ ఉందనడం అపోహే : ఎంవీ రమణారెడ్డి హైదరాబాద్‌లో రెవెన్యూ ఉందంటూ అది ఉమ్మడి రాజధాని కావాలని కోరడం సమంజసం కాదని రాయలసీమ జేఏసీ కన్వీనర్ ఎంవీ రమణారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలతో కలిసి ఉంది కాబట్టే సేల్స్ టాక్సీ ఎక్కువ రావడం సహజమని, ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత ఎవరి రెవెన్యూ వారికే వస్తుందన్నారు. నదీ జలాల విషయంలోనూ ప్రజలకు అపోహలు ఉన్నాయని పేర్కొన్నారు. గోదావరి నుంచి 1500 టీఎంసీల నీరు, కృష్ణా నుంచి 300 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తుందని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ ఆనకట్టలు కట్టి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అన్ని ప్రాంతాల వారు కూర్చొని చర్చించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు తొందరపడాల్సిన అవసరం లేదని, నిగ్రహం, సంయమనం పాటించాలన్నారు. సచివాలయం నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సి వస్తుందనడంతో ఉద్యమం బలం పుంజుకుందన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం : కాట్రగడ్డ ప్రసూన హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన అన్నారు. తెలంగాణలో ఎవరైనా ఉండొచ్చని.. ఇదొక పుష్ప గుచ్ఛంలాంటిదని కోదండరాం అన్నారని గుర్తు చేశారు. పొట్టకూటి కోసం వచ్చారని మాత్రం అనొద్దని విజ్ఞప్తి చేశారు. గ్లోబలైజేషన్లో ఎక్కడ నాగరికత ఉంటే అక్కడికి వెళ్తారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి హాని జరగలేదన్నారు. భవిష్యత్‌లో మాకొన్ని చట్టాలు కావాలని కోరడం తప్పులేదని భావిస్తున్నానన్నారు. నీళ్లు రావనుకోవడం రాయలసీమ వాసుల భ్రమ :విద్యాసాగర్‌రావు జల నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ కృష్ణా బేసిన్లో ఉన్న 18శాతం వాటానే తప్ప తెలంగాణ ఏర్పడితే మాకు నీళ్లు రావని రాయలసీమ వాసులు అనుకోవడం భ్రమ అన్నారు. అదనపు నీళ్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నదుల అనుసంధానం ద్వారా న్యాయం చేయాలని అడగాలన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మాకెలాంటి అభ్యంతరమూ లేదన్నారు. చట్టబద్ధంగా నికరజలాలైనా, మిగులు జలాలైనా తీసుకోవాలి తప్ప హక్కు లేని దానిని హక్కుగా భావించి అన్యాయం జరుగుతుందనడం భావ్యం కాదన్నారు. మా నీళ్లు.. మా నిధులు.. మా నియామకాల కోసమే పోట్లాడుతున్నాం తప్ప ఎవరికి అన్యాయం చేయమన్నారు. టీజేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ శాంతిని కోరుకుంటున్నాం.. రాష్ట్రాలుగా విడిపోవాలనుకుంటున్నామన్నారు. అడ్డుకుంటే మిగిలి ఉన్న సాయుధ పోరాట శకలాలను కొనసాగించడానికి వెనుకాడబోమన్నారు. ప్రజాస్వామిక ఆకాంక్షను వ్యతి రేకించే హక్కు ఎవరికి లేదన్నారు. విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పే మాటల్లో వాస్తవం లేదన్నారు. కార్యక్రమానికి జన చైతన్య వేదిక అధ్యక్షుడు పశ్య ఇంద్రసేనారెడ్డి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి బద్దం అశోక్‌రెడ్డి కార్యదర్శి నివేదిక సమర్పించారు. ఇంకా సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మీలా సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక సభ్యులు డాక్టర్ రామయ్య, కొల్లు మధుసూదన్‌రావు, యానాల యాదగిరిరెడ్డి, మర్రు హన్మంతరావు, ఏనుగు లింగారెడ్డి పాల్గొన్నారు. -
సీమాంధ్ర నేతల ప్రేమంతా.. హైదరాబాద్ భూములపైనే: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర నేతలు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించింది ప్రజలపై ప్రేమతో కాదని, ఆ ప్రేమంతా హైదరాబాద్ భూములపైనేనని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంు వ్యాఖ్యానిం చారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జేఏసీ నిర్వహించిన శాంతిదీక్షలో బుధవారం ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని అత్యంత విలువైన భూములు, ఆస్తుల మీద ఆపేక్షతోనే సీమాంధ్ర నేతలు మాట్లాడుతున్నారని విమర్శించా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇక్కడే ఉండేం దుకు హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి ఆందోళనలు, భయాలు లేవన్నారు. తెలంగాణ ఆస్తులను, వనరులను, భూములను, ఉద్యోగాలను దోచుకుని వేల కోట్లు దాచిపెట్టుకున్నవారు మాత్రమే భయపడుతున్నారని కోదండరాం విమర్శించారు. తెలంగాణ వనరులను, భూములను రక్షించడానికి రాజ్యాంగ బద్ధమైన హక్కులను, చట్టాలను సమైక్య రాష్ట్రంలో అమలుచేయలేదన్నారు. తెలంగాణ ప్రాంతీయ మండలి, పెద్ద మనుషుల ఒప్పందం వంటి ఎన్నో ప్రయోగాలు విఫలమయ్యాయన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇంకా విఫల ప్రయోగాల జోలికి వెళ్లకుండా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా.. ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు తీర్పు రాజ్యాంగం ప్రకారమే ఉంద ని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాల పట్ల, సీమాంధ్ర పట్ల ప్రభుత్వం, పోలీసుల తీరు ప్రపంచం ఎదుట తేలిపోయిందన్నారు. తెలంగాణలో రాజ్యాంగ బద్ధమైన హక్కుల ఉల్లంఘన వల్లే ఈ ప్రాంతంలో ఉద్యోగులు, ప్రజలు ఉద్యమించారని దేవీప్రసాద్ చెప్పారు. తెలంగాణ జేఏసీ కో-చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై ఎస్మాను ప్రయోగించిన ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యమాలపై ఎందుకు ప్రయోగించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతంలోనూ తెలంగాణ వాదులపై పోలీసుల నిర్బంధాలను అమలుచేస్తున్నారని జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆంధ్ర ప్రాంతంలో పల్నాటి శ్రీరాములుపై జరిగిన దాడిని ఖండించారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పిన సీఎం కిరణ్ రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శిం చారు. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని, ఈ నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. 25న ఢిల్లీకి కేసీఆర్.. టీఆర్ఎస్ అధినేత, ఎంపీ కె.చంద్రశేఖర్‌రావు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఈనెల 25వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటిసారిగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటం వల్ల ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.