సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, జేఏసీ ముఖ్యనేతలు పలువురితో కలిసి బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జానారెడ్డిలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, మల్లేపల్లి లక్ష్మయ్య, రాజేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు కోదండరాం వెంట ఉన్నారు. గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు కేసీఆర్‌తో కలసి జేఏసీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశం కానున్నారు.
హస్తినలో టీ జేఏసీ భేటీలు
Published Thu, Feb 6 2014 2:21 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement