నేడు తెలంగాణ జేఏసీ సమావేశం | Telangana political jac plans public meeting in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 14 2013 10:11 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేడు సమావేశం కానుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు త్వరితగతిన పూర్తిచేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరు కానున్నారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో భారీ సభతో పాటు ఢిల్లీ యాత్రపై కూడా ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న తీరుపై జేఏసీ నేతలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలంటూ వస్తున్న ఆందోళనల నేపధ్యంలో జేఏసీ కీలక ప్రకటన చేయనుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement