
పోలీసుల చర్యలను ఖండించిన కోదండరామ్
హైదరాబాద్ : నిజాం కళాశాల అతిథిగృహంలో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఖండించారు. పోలీసుల చర్యలు దారుణంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా నిజాం కళాశాలలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించారు. పోలీసుల తీరుపై కళాశాల ప్రిన్సిపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఈరోజు ఉదయం నిజాం కళాశాల హాస్టల్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాన్ బోర్డర్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.