సీమాంధ్ర నేతల ప్రేమంతా.. హైదరాబాద్ భూములపైనే: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర నేతలు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించింది ప్రజలపై ప్రేమతో కాదని, ఆ ప్రేమంతా హైదరాబాద్ భూములపైనేనని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంు వ్యాఖ్యానిం చారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జేఏసీ నిర్వహించిన శాంతిదీక్షలో బుధవారం ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని అత్యంత విలువైన భూములు, ఆస్తుల మీద ఆపేక్షతోనే సీమాంధ్ర నేతలు మాట్లాడుతున్నారని విమర్శించా రు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇక్కడే ఉండేం దుకు హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి ఆందోళనలు, భయాలు లేవన్నారు. తెలంగాణ ఆస్తులను, వనరులను, భూములను, ఉద్యోగాలను దోచుకుని వేల కోట్లు దాచిపెట్టుకున్నవారు మాత్రమే భయపడుతున్నారని కోదండరాం విమర్శించారు. తెలంగాణ వనరులను, భూములను రక్షించడానికి రాజ్యాంగ బద్ధమైన హక్కులను, చట్టాలను సమైక్య రాష్ట్రంలో అమలుచేయలేదన్నారు. తెలంగాణ ప్రాంతీయ మండలి, పెద్ద మనుషుల ఒప్పందం వంటి ఎన్నో ప్రయోగాలు విఫలమయ్యాయన్నారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనను కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇంకా విఫల ప్రయోగాల జోలికి వెళ్లకుండా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా.. ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు తీర్పు రాజ్యాంగం ప్రకారమే ఉంద ని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాల పట్ల, సీమాంధ్ర పట్ల ప్రభుత్వం, పోలీసుల తీరు ప్రపంచం ఎదుట తేలిపోయిందన్నారు. తెలంగాణలో రాజ్యాంగ బద్ధమైన హక్కుల ఉల్లంఘన వల్లే ఈ ప్రాంతంలో ఉద్యోగులు, ప్రజలు ఉద్యమించారని దేవీప్రసాద్ చెప్పారు. తెలంగాణ జేఏసీ కో-చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై ఎస్మాను ప్రయోగించిన ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యమాలపై ఎందుకు ప్రయోగించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతంలోనూ తెలంగాణ వాదులపై పోలీసుల నిర్బంధాలను అమలుచేస్తున్నారని జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆంధ్ర ప్రాంతంలో పల్నాటి శ్రీరాములుపై జరిగిన దాడిని ఖండించారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పిన సీఎం కిరణ్ రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శిం చారు. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని, ఈ నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.
25న ఢిల్లీకి కేసీఆర్.. టీఆర్‌ఎస్ అధినేత, ఎంపీ కె.చంద్రశేఖర్‌రావు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఈనెల 25వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటిసారిగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటం వల్ల ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.