'హైదరాబాద్‌లో పాగా వేస్తామన్న వారిని పాతరేస్తాం'
మహబూబ్‌నగర్: భోగి మంటల్లో తెలంగాణ బిల్లు ప్రతులు దగ్దం చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్టేనని తెలంగాణ రాజకీయ జేఏసీ కో- ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విభజనను భోగి మంటల్లో దగ్ధం చేసిన ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర నేతలపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పాగా వేస్తామన్న సీమాంధ్ర నేతలను పాతరేస్తామని ఆయన హెచ్చరించారు. 90 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
-
సీమాంధ్రుల కబంధహస్తాల్లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేవరకు పోరాటం కొనసాగుతుందని అతంకుముందు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణను అడ్డుకునే శక్తుల జాబితాను తయారుచేస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత వారి భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చ మొదలైందని, అల్లరిచేస్తూ చర్చ జరగకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు.