హైదరాబాద్, న్యూస్‌లైన్: పేద విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ రాజకీయ జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఆధార్ లింకేజీని ప్రభుత్వం ముడిపెట్టిందని శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో వారు విమర్శించారు. అనం తరం స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని, రీయిం బర్స్‌మెంట్‌కు ఆధార్ లింకేజీని తొలగిం చాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ విద్యార్థులు చలో అసెంబ్లీ చేపట్టారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.
‘ఆధార్ లింకేజీ వద్దు’
Published Sat, Jan 25 2014 12:54 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement